TEJA NEWS

త్వరలో మీతో.. మీ చంద్రబాబు.. మన్‌ కీ బాత్‌ తరహాలో..

సంక్రాంతి నుంచి ప్రారంభం..

అమరావతి: ప్రధాని మోదీ నిర్వహిస్తున్న మన్‌ కీ బాత్‌ తరహాలోనే.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కూడా ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు..

సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఆయన హయాంలోనే 1995-2004 మధ్య ‘డయల్‌ యువర్‌ సీఎం’ నిర్వహించారు. ఇప్పుడు మన్‌ కీ బాత్, డయల్‌ యువర్‌ సీఎం కార్యక్రమాల కలయిక ద్వారా ప్రజలతో మమేకం అయ్యేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. త్వరలోనే ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నట్లు బుధవారం అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆడియో/ వీడియో విధానంలో దీన్ని నిర్వహించే అవకాశం ఉంది..


TEJA NEWS