TEJA NEWS

అమీన్పూర్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో సమావేశం
బిఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ సభ్యులు వెంకటరామిరెడ్డి కి మద్దతుగా ఇంటింటి ప్రచారాన్ని వేగవంతం చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఉదయం అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తున్న పార్టీ ప్రచార శైలిని అడిగి తెలుసుకున్నారు. బూత్ స్థాయి సమావేశాల ద్వారా కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ.. ఉదయం సాయంత్రం ఇంటింటి ప్రచారం నిర్వహించాలని కోరారు. గత నాలుగేళ్లలో మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధిని ఓటర్లకు వివరించడంతోపాటు.. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను వివరించాలని కోరారు. హాజరైన మున్సిపల్ చైర్మన్ టిపిఆర్, వైస్ నరసింహా గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు బాల్ రెడ్డి, కాటా రాజు గౌడ్, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.


TEJA NEWS