శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయ ప్రాణమఠం ప్రాజెక్టు పనులు ప్రారంభం
శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో రూ. పన్నెండు లక్షలతో నిర్మిస్తున్న ప్రాణ మఠం ప్రాజెక్టు పనులు మోక్ష జ్యువెలర్స్ హైదరాబాదులో ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు సాయి శివ, ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ స్వామి, ప్రాణ మఠం దాత రాపోలు లీలావతి వెండికి పూజ చేశారు. ప్రాణమఠం పూర్తి కావడానికి మూడు నెలల సమయం పడుతుందని మోక్ష జ్యువెలర్స్ యజమాని జగన్మోహన్ తెలిపారు. ఈ ప్రాజెక్టు మాకు రావడం చాలా సంతోషంగా ఉందని, చరిత్రలో మేము చేసిన పనులు మరకత శివాలయంలో జీవితకాలం ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.