శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం,
విజయవాడ :
అయ్యప్ప నగర్, విజయవాడకు చెందిన కొల్లూరి విజయలక్ష్మి దంపతులు శ్రీ అమ్మవారి దేవస్థానం నందు జరుగు అన్నదానం నిమిత్తం ఆలయ ఈవో కె ఎస్ రామరావు, డిప్యూటీ ఈవో ఎం. రత్న రాజు ను కలిసి రూ. 1,11,111/- లను చెక్కు రూపములో విరాళంగా అందజేశారు.
అనంతరం వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులచే వేదార్వచనం కల్పించగా, ఆలయ ఈవో వీరికి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు.
మరియు డోనార్ సెల్ ద్వారా వెంటనే వీరికి డోనార్ (NFC టెక్నాలజీ) కార్డు కూడా అందజేయడం జరిగినది.