TEJA NEWS

ఏపీ సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం కొనసాగుతోంది.ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బ్యాంకర్లకు ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం నారా చంద్రబాబు నాయుడు వివరించారు.

డీబీటీ పథకాల అమలు, అభివృద్ధికి బ్యాంకర్ల సహాయం అవసరమని పేర్కొన్నారు.సబ్సిడీ రుణాలు, వివిధ పథకాల లబ్ధిదారులకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్లదే కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు.

ఏపీ సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ

TEJA NEWS