TEJA NEWS

రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర సోదరులు కొల్లు వెంకటరమణ హఠాన్మరణం చాలా బాధాకరం.

-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు .

ఎన్టీఆర్ జిల్లా, మచిలీపట్నం,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సోదరులు కొల్లు వెంకటరమణ ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దివంగత కొల్లు వెంకటరమణ సంస్మరణ కార్యక్రమం మచిలీపట్నంలోని వారి స్వగృహంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. కొల్లు వెంకటరమణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతి చాలా బాధాకరమన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. మంత్రి కొల్లు రవీంద్ర ని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS