TEJA NEWS

ఉద్యోగాలు సాధించడంలో దూసుకుపోతున్న కుమ్రం భీమ్ స్టడీ సర్కిల్ విద్యార్థులు..మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు…

ఆసిఫాబాద్ కుమ్రం భీమ్ స్టడీ సర్కిల్ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శిక్షణ పొంది తొలిప్రయత్నం లోనే ఆరుగురు గురు అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. స్టడీ సర్కిల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు పాల్గొని మాట్లాడుతూ..వివిధ పోటీపరీక్షలు రాసి ఈ సంవత్సరంలో కుమ్రం భీమ్ స్టడీ సర్కిల్ ఆసిఫాబాద్, హైదరాబాద్ శాఖల నుండి 15 కీ పైగా ఆదివాసీ విద్యార్థులు ఉద్యోగాలు పొందడం సంతోషకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో కుమ్రం భీమ్ స్టడీ సర్కిల్ అధ్యక్షులు రాయ్ సిడాం రాము,కోశాధికారి సోయం ఇందురావు,డైరెక్టర్లు ఊశన్న,రాజేశేఖర్ అభ్యర్థులు పాల్గొన్నారు.


TEJA NEWS