TEJA NEWS

కీసర పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ 2023-24 విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారని పల్లవి స్కూల్ డైరెక్టర్ సుశీల్ కుమార్ తెలిపారు. కీసర పల్లవి స్కూల్లో జరిగిన మీడియా సమావేశంలో డైరెక్టర్ సుశీల్ కుమార్ మాట్లాడుతూ 2014 లో స్థాపించిన పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఫలితాలు ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చాయని అన్నారు. ఈ విద్యా సంవత్సరం స్కూల్ టాపర్ గా ఎమ్ పునీత్ (97.2%),సెకండ్ టాపర్ గా ఎమ్ యుగాల (95.6%) ,సాయి సుభాష్ 91.4 గా నిలిచారు. A1 గ్రేడ్ 90% వచ్చిన విద్యార్థులు 70 మంది ఉన్నారు. ఇద్దరు విద్యార్ధులు మ్యాథమెటిక్స్ లో 100% సాధించారు. ప్రతి సంవత్సరం విద్యార్థులు ప్రగతి సాధిస్తూ, మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారు అని అన్నారు. మంచి ఉత్తీర్ణత కు సహకరించిన ప్రిన్సిపల్ శ్రీలత చేన్న ప్రగడ కు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు డైరెక్టర్ సుశీల్ కుమార్..


TEJA NEWS