సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ

సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ

TEJA NEWS

YS Jagan case Supreme Court: సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ

ఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు (శుక్రవారం) విచారణ జరపనుంది..

బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీచేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కాగా జగన్ బెయిల్ రద్దు, కేసుల బదిలీ పిటిషన్లపై సుప్రీంకోర్టు గతంలో సీబీఐకి నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ ఎందుకు జాప్యం అవుతుందో చెప్పాలని సీబీఐని అత్యున్నత న్యాయస్థానం కోరింది..

Print Friendly, PDF & Email

TEJA NEWS