TEJA NEWS

సూరారంలో కోరవడిన నిఘా వ్యవస్థ
సూరారంలో కోరవడిన నిఘా వ్యవస్థ పనిచేయని సీసీ కెమెరాలు అంటున్న పోలీస్ అధికారులు ఎక్కడ ఏమైనా అన్నిటికి ఆధారమైన సీసీ కెమెరాలు పనిచేయటం లేదు ఎక్కడ రికార్డు కాలేదు అని చేతులెతేస్తున్న సూరారం పోలీస్ వారు, విషయానికి వెళితే సూరారం పోలీస్ స్టేషన్ సమీపంలోని సూరారం సిగ్నల్ దగ్గర న్యూస్ పేపర్ సంపాదకులు కార్ ఆగి ఉంది ఆ కార్ ని గుర్తు తెలియని కార్ గుద్ది డామేజ్ చేసి వెళ్లి పోయింది, ఈ విషయం తెలుసుకున్న సంపాదకులు సూరారం పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు అక్కడికి వెళ్లి సీఐ కి జరిగిందంతా వివరించారు అది కావాలని చేసిందా లేకపోతే ఆక్సిడెంట్ ఆ అని అనుమానాన్ని కూడా వ్యక్తం చేసారు దానికి సీఐ ఒక కానిస్టేబుల్ ని ఇచ్చి మీరు చెక్ చేసి రండి అని చెప్పారు చేసేది ఏమి లేక కానిస్టేబుల్ వెంట వెళ్లారు ఎక్కడ బయట సీసీ కెమెరాలు పనిచేయటం లేదు అని ప్రైవేట్ షాపులలో ఉన్న సీసీ కెమెరాలు చూసారు ఎక్కడ కూడా సీసీ కెమెరాలు వాళ్ళ షాపుల పరిధిలో మాత్రమే వాళ్ళు పెట్టుకున్నారు, ఎక్కడ చూసిన సీసీ కెమెరా ఫుటేజ్ లభించలేదు అని కానిస్టేబుల్ సీఐ గారికి చెప్పగా ఫుటేజ్ లేని కారణంగా మేము కేసు తీసుకోలేము అని ఏమి చేయలేము అని చెప్పారు, ఒక కార్ డామేజ్ పరిస్థితి ఇలా ఉంటే ఏదైనా అమానుషమైన సంఘటన జరిగితే ఏంటి పరిస్థితి నిందితులని ఎలా గుర్తిస్తారు పోలీస్ లకు కీలకమైన సీసీ కెమెరాలు పనిచేయటం లేదు అంటే పోలీస్ నిఘా వ్యవస్థ ఉన్నట్టా లేనట్టా అనే సందేహం కలుగుతుంది, రాత్రి వెళ్లలో ఏదైనా దుర్ఘటనలు జరిగితే సూరారం లో పోలీస్ వారు ఏమి చేయలేరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఒక పత్రికా సంపాదకుడి కార్ పరిస్థితి ఇది అయితే సామాన్య ప్రజల గోష ఏంటి అని కోటి డాలర్ల ప్రశ్న

Print Friendly, PDF & Email

TEJA NEWS