డయాగ్నస్టిక్ వ్యవస్థను కుప్పకూల్చడం బాధాకరం: హరీశ్ రావు

డయాగ్నస్టిక్ వ్యవస్థను కుప్పకూల్చడం బాధాకరం: హరీశ్ రావు

డయాగ్నస్టిక్ వ్యవస్థను కుప్పకూల్చడం బాధాకరం: హరీశ్ రావుప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షల కోసం కేసీఆర్ ప్రారంభించిన డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూల్చడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ 36 డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటుచేసి 134 పరీక్షలను అందుబాటులో ఉంచారని, అవి ప్రస్తుతం నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ఇప్పటికైనా అందులో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి పెండింగ్ జీతాలు చెల్లించి ఆ సేవలను పునరుద్ధరించాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.

కార్మికవర్గ ఐక్యత,పోరాటలతోనే సోషలిస్టు వ్యవస్థను నిర్మించవచ్చు.ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యం డి యూసుఫ్.

కార్మికవర్గ ఐక్యత,పోరాటలతోనే సోషలిస్టు వ్యవస్థను నిర్మించవచ్చు.ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యం డి యూసుఫ్.

138 వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా నేడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శ్రీనివాస్ నగర్, షాపూర్ నగర్,జగతగిరిగుట్ట, ఐడిపిఎల్,గాంధీనగర్,గిరినగర్, అంజయ్య నగర్,మక్డుం నగర్ బీరప్పనగర్, శ్రీరంనాగర్, జీడిమెట్ల,కుత్బుల్లాపూర్ మునిసిపల్ కార్యాలయం, వివిధ కంపెనీల ముందు ఏర్పాటు చేసిన ఎర్రజండా దిమ్మెల వద్ద అరుణపథకాన్ని ఎగురవేసిన అనంతరం షాపూర్ నగర్ ఏఐటీయూసీ కార్యాలయంలో సభను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యూసఫ్ పాల్గొని మాట్లాడుతూ కనీస పని గంటల కోసం 138 సంవత్సరాల క్రితమే…