TEJA NEWS

ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోండి.

ఇబ్రహీంపట్నం మండలానికి రూ.5కోట్లు మంజూరు.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్,

ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకొని చేస్తూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు సూచించారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ఆయన ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన ఎన్డీఏ కూటమి నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ సమస్యల తీవ్రతను బట్టి జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో విధులను ఖర్చు చేయాలని సూచించారు. ఇబ్రహీంపట్నం మండలానికి రూ.5కోట్లు మంజూరు అయినట్లు పేర్కొన్నారు. వీటిని సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణం కోసం వెచ్చించాలన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలో మొత్తం 34 బూత్ లు ఉన్నాయని, ఒక్కో బూత్ కు సుమారు రూ.15 లక్షల వరకు నిధుల సౌలభ్యం ఉంటుందన్నారు.

ఎన్డీఏ మహాకూటమి ఘన విజయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తో పాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర, బీజేపీ నేతల కృషి ఎంతో కీలకమన్నారు. అందుకే ఎన్డీఏ కూటమికి ఘనవిజయం లభించిందన్నారు. దీన్ని గుర్తించి అందరూ ఐకమత్యంగా ఉంటూ ప్రజలకు విశిష్ట సేవలు అందించాలన్నారు. ముఖ్యంగా కక్ష సాధింపు చర్యలు వద్దన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పారదర్శకంగా పని చేయాలన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేదల పక్షపాతి అని అన్నారు. పేదలకు గ్రామాల్లో 3 సెంట్ల స్థలం, గృహ నిర్మాణానికి 4 లక్షలు నిర్ణయంతో పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు శ్రీకారం చుట్టారన్నారు. ముఖ్యంగా పింఛన్లు పెంపుదలతో పేదల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయన్నారు. స్థానిక ఎన్డీఏ మహాకూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS