పుల్లలచెరువు పట్టణంలో టిడిపి మండల అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్ రావు ఆధ్వర్యంలో గత వారం రోజుల నుండి తాగునీటి ట్యాంకర్లను సరఫరా చేస్తున్నారు. ఈ నెల 1 నుండి ట్యాంకర్లను నిలిపివేసిన వైసిపి ప్రభుత్వం ప్రజల అవసరాలను పట్టించుకోకుండా వదిలేసింది. దీంతో ప్రజల అవసరార్ధం టిడిపి ఆధ్వర్యంలో నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి పుల్లలచెరువు పట్టణ తాగునీటి అవసరాలను తీరుస్తున్నారు. దీంతో పుల్లలచెరువు పట్టణ ప్రజలు తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలిపారు.