TEJA NEWS

మళ్లీ మునిగిన టేకుమట్ల

రాత్రి కురిసిన భారీ వర్షానికి టేకుమట్ల గ్రామం లోని పలు లోతట్టు ప్రాంతాలు నీటిమట్టమయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు అనేక అవస్థలకు గురయ్యారు. మొదటిసారిగా సెప్టెంబర్ 25 న కురిసిన వర్షానికి గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్పందించిన ఎమ్మార్వో,ఎంపీడీవో గ్రామపంచాయతీ సిబ్బంది సహాయక చర్యలు చేసి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ
అక్టోబర్ 3న భారీ ఈదురు గాలులకు గ్రామంలో అనేక చెట్లు విద్యుత్ స్తంభాలు నేల కోరిగాయి. ఈ సంఘటన మరిచేలోపే అక్టోబర్ 23 (మంగళవారం రాత్రి) కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఈ ప్రమాదానికి కాలువల ఆక్రమణ ప్రధాన కారణంగా తెలుస్తుంది.
సూర్యపేట ఎమ్మార్వో శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో కబ్జాకు గురైన కాలువలను జెసిబి సహాయంతో సెప్టెంబర్ 25న తవ్వకాలు జరిపారు.
కానీ వాటికి ఎటువంటి మరమ్మతులు చేయకపోవడంతో గత కొద్ది రోజుల క్రితమే ఆ కాలువలను మరలా పూడ్చి వేయడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాలువల సంరక్షణపై పకడ్బందీ చర్యలు తీసుకుని గ్రామస్తుల నివాసాలకు రక్షణ కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.


TEJA NEWS