TEJA NEWS

T. S. In place of T. G. To execute immediately

జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష

టి. ఎస్. స్థానంలో టి. జి. ని తక్షణమే అమలు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష అధికారులను ఆదేశించారు.
()
టి. ఎస్. స్థానంలో టి. జి. ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తక్షణమే అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర అబ్రియేషన్స్ సూచించే “టి. ఎస్.” స్థానంలో టి. జి. ని వినియోగించుకునేందుకు కేంద్రం అనుమతిస్తూ గెజిట్ జారీ చేసిన దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి శుక్రవారం ఉత్తర్వులు వెలుబడ్డాయని తెలిపారు.

జిల్లాలో ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, వెబ్ సైట్లు, ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్లు ఏదైనా ఇతర అధికారిక కమ్యూనికేషన్లు సైతం తెలంగాణ కోడ్ ను టి. ఎస్. బదులుగా టి. జి ని వాడాలని కలెక్టర్ కోరారు. లెటర్ హెడ్లు , రిపోర్టులు , నోటిఫికేషన్లు, అధికారిక వెబ్ సైట్లు, ఆన్ లైన్ ఫ్లాట్ ఫార్మ్ , పాలసీ పేపర్లు, జీవోలు, ఇతర అధికారిక కమ్యూనికేషన్లు అన్నింటిపై టి. ఎస్. స్థానంలో టి. జి. గా మార్చాలని కలెక్టర్ పేర్కొన్నారు. శాఖల ద్వారా భవిష్యత్తులో నిర్వహించే ఉత్తర, ప్రత్యుత్తరాలలో టి. ఎస్. కు బదులుగా టి. జి. ని ముద్రించాలని సూచించారు. ఈ మేరకు తీసుకున్న చర్యలపై ఈ నెల 25 వ తేదీలోపు అన్నీ శాఖల అధికారులు నివేదికలు పంపాలని, అట్టి నివేదికలు క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు కలెక్టర్ తెలిపారు.


TEJA NEWS