తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్(61)  మరణించారు

తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్(61) మరణించారు

TEJA NEWS

Thalasani Srinivas Yadav's brother Shankar Yadav (61) passed away

మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్(61) తెల్లవారు జామున మరణించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించారు. ఆయన పార్దీవ దేహంకు నివాళులు అర్పించారు. శంకర్ యాదవ్ ప్రస్తుతం మోండా మార్కెట్ అధ్యక్షులుగా వ్యవహారిస్తున్నారు. బోయిన్ పల్లి కూరగాయల మార్కెట్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా కూడా పని చేశారు. హమాలీల అసోసియేషన్ అధ్యక్షుడిగా కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారు. శంకర్ యాదవ్ మరణం వార్త తెలుసుకున్న వెంటనే మోండా మార్కెట్, బోయిన్ పల్లి మార్కెట్ లకు చెందిన పలువురు వ్యాపారులు, కార్మికులు పెద్ద ఎత్తున వెస్ట్ మారేడ్ పల్లిలోని రాధికా కాలనీలో గల శంకర్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు. శంకర్ యాదవ్ పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించారు. తన సోదరుడి పార్థివ దేహం చూసి తలసాని శ్రీనివాస్ యాదవ్ కన్నీటి పర్యంతమైనారు.

పలువురు ప్రముఖుల పరామర్శ

మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పలువురు ప్రముఖులు పరామర్శించారు. శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ మృతి వార్త తెలుసుకున్న పలువురు వెస్ట్ మారేడ్ పల్లి లోని శంకర్ యాదవ్ నివాసం వద్ద శంకర్ యాదవ్ పార్థివ దేహం పై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సంతాపం, సానుబూతిని తెలిపారు. మాజీమంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మహమూద్ అలీ, మాజీ డిప్యుటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్,MLC ఎగ్గే మల్లేశం, MLA లు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, మాజీ MP లు అంజన్ కుమార్ యాదవ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ mlc శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ లు ఎర్రోళ్ల శ్రీనివాస్, అనిల్ కూర్మాచలం, రజనీ సాయిచంద్, మేడే రాజీవ్ సాగర్, BRS పార్టీ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ MLA శ్రీ గణేష్, BRS ఇంచార్జి నివేదిత, BJP నాయకులు చీకోటి ప్రవీణ్, BRS నాయకులు ముఠా జయసింహా, రాంబాబు యాదవ్, గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ ప్రసన్న, యాదవ సంఘం నాయకులు రాజారామ్ యాదవ్, గోవర్ధన్ యాదవ్, BC సంఘం నాయకులు కొండూరు సత్యనారాయణ, కార్పొరేటర్ లు హేమలత, టి. మహేశ్వరి, హేమ, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి,అత్తిలి అరుణ గౌడ్, వివిధ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు శంకర్ యాదవ్ కు నివాళులు అర్పించి సంతాపం తెలిపారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS