TEJA NEWS

యాదవ వనసమారాదన కార్యక్రమం ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు

-డీసీసీబీ డైరెక్టర్, మేకల మల్లిబాబు యాదవ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;

ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం నాడు జరిగిన యాదవ కురుమ బంధువుల మన సమారాధన కార్యక్రమం లో భారీ ఎత్తున వేలాదిగా పాల్గొని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ గౌరవాధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ ధన్యవాదములు తెలిపినారు.
సోమవారం నాడు అఖిలభారత మహాసభ ఖమ్మం జిల్లా కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేవలం మూడు రోజుల సమయంలోనే ఈ కార్యక్రమం నిర్ణయం తీసుకొని ఏర్పాట్లు చేయడం జరిగిందని, అయినా కూడా అఖిల భారత యాదవ మహాసభ పిలుపుమేరకు వేలాదిగా కుటుంబాలతో సహా పాల్గొనడం యాదవుల ఐక్యతకు నిదర్శనమని, ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్ తో పాటు కొమురెల్లి మల్లన్న దేవస్థానం మాజీ చైర్మన్ సంపత్ యాదవ్, గొర్ల యశ్వంత్ యాదవ్ తదితరులు పాల్గొని వారి ప్రసంగాలతో యాదవులకు, కురుమ లకు రాజకీయ చైతన్యం కలగాలని, స్ఫూర్తినింపడం చాలా సంతోషదాయకమని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చేతుల నాగేశ్వరరావు, మొరిమేకల కోటయ్య,పొదిలి సతీష్, బండారు ప్రభాకర్, పొదిలి ఆదినారాయణ, తెల్లబోయిన రమణ చేతుల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS