TEJA NEWS

పెనమలూరు నియోజకవర్గం,ఉయ్యూరు టౌన్ పార్టీ కార్యాలయంలో జరిగిన తెదేపా, జనసేన, బిజెపి నాయకుల, కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని అందరం కలిసికట్టుగా పనిచేసి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ప్రసంగించిన రాజేంద్రప్రసాద్ .

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…

రాష్ట్రానికి, మన బిడ్డలకు భవిష్యత్తు ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలని, ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు, వ్యవస్థలు అణిచివేతకు గురికాబడ్డాయని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని, అలాగే మనందరం కష్టపడి పెనమలూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమీ అభ్యర్థి బోడె ప్రసాద్ ని, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాజేంద్రప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో తెదేపా సగర సాధికార రాష్ట్ర అధ్యక్షులు జంపన వీర శ్రీనివాస్, నగర పంచాయతీ మాజీ చైర్మన్ లు జంపాన పూర్ణచంద్రరావు, అబ్దుల్ కుదూస్, టౌన్ పార్టీ అధ్యక్షులు జంపాన గురునాధరావు, క్లస్టర్ ఇంచార్జి కూనప రెడ్డి వాసు, మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా, బీసీ సెల్ కార్యదర్శి రాజుల పాటి ఫణి,నగర పంచాయతీ కౌన్సిలర్లు పలియాల శ్రీనివాసరావు, మాజీ కోఆప్షన్ సభ్యులు రఫీ,నజీర్, జిల్లా అధికార ప్రతినిధి కొండా ప్రవీణ్, బూరెల నరేష్,జనసేన మండల పార్టీ అధ్యక్షులు జరుగు ఆదినారాయణ, జనసేన నాయకులు బొప్పన ప్రసాదు జనసేన వీర మహిళలు మైనార్టీ నాయకులు బీసీ నాయకులు ఎస్సీ నాయకులు బూత్ కన్వీనర్లు , యూనిట్ ఇన్చార్జిలు మరియుజనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బిజెపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు…


TEJA NEWS