TEJA NEWS

పేదల సంక్షేమం, ఏపీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

జి.కొండూరు మండలంలోని 8728 మందికి రూ.3.67 కోట్లు.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు.

పేదల సంక్షేమం, ఏపీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.

ఆయన ఉదయం జి.కొండూరు మండలంలోని వెలగలేరు, కవులూరు గ్రామాల్లో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్ల సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ

జి.కొండూరు మండల వ్యాప్తంగా 8728 మంది లబ్ధిదారులకు రూ.3,67,92,000లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నియోజకవర్గ వర్గ వ్యాప్తంగా దాదాపు 95 శాతానికి పైగా పింఛన్ల సొమ్ము లబ్ధిదారులకు చేరిందన్నారు.

సమాజంలోని పేద, బలహీన వర్గాల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారధ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పింఛన్ల సొమ్మును పెంచి అందజేస్తోందన్నారు.

ముఖ్యంగా వృద్ధులు, బలహీనులు, వితంతువులు, వైకల్యం, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారు మొదలైన వారి కష్టాలను తీర్చడానికి, గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు పింఛన్ అందజేత ఒక ప్రధాన సంక్షేమ చర్య అని అన్నారు.

వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులకు సామాజిక భద్రత పింఛన్ల సొమ్మును అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. సొమ్మును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ముందుగా కవులూరులో గంగానమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహన్రావు (గాంధీ) , ఎన్డీఏ మహాకూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS