భారత మహిళా క్రికెటర్ల ఘన విజయం .. హృదయాల నుంచి చెరిగిపోని చారిత్రక ఘట్టం
….
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ లు భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు : అనితా భాయి
- మహిళల్ని అన్నిరంగాల్లో అన్నివేళలా ప్రోత్సహించడంలో మాజీమంత్రి ప్రత్తిపాటి.. మంత్రి నారాలోకేశ్ లు ఎప్పుడూ ముందుంటారు : నియోజకవర్గ మహిళానేతలు, కౌన్సిలర్లు.
- భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన సందర్భంగా క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుమహిళల ప్రత్యేక వేడుకలు
భారత మహిళా క్రికెటర్లు తమ అసమాన ప్రతిభా, సామర్థ్యంతో ప్రపంచ కప్పు గెలిచిన ప్రత్యేక సందర్భాన్ని నియోజకవర్గ తెలుగుమహిళా విభాగం, పట్టణ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు సంతోషంగా వేడుక చేసుకున్నారు. భాతర క్రికెటర్ల ఫైనల్ మ్యాచ్ చూసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మహిళానేతలు, జట్టుకు అభినందనలు తెలుపుతూ కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఆ వివరాలు వారిమాటల్లోనే ..!
భారతజట్టు విజయం సాధించాలని చంద్రబాబు, లోకేశ్, ప్రత్తిపాటి బలంగా కోరుకున్నారు.. శ్రీమతి అద్దంకి అనితా భాయి (నియోజకవర్గ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు)
“ ప్రపంచమంతా ఇండియావైపు చూసేలా చేసిన భారత మహిళా క్రికెటర్లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ రాష్ట్ర మహిళలకు ఆర్థిక స్థిరత్వం కల్పించడంతో పాటు.. వారి శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పారు. అటువంటి నాయకుల సారథ్యం రాష్ట్రానికి, ముఖ్యంగా తెలుగుమహిళలకు ఎంతో మేలు చేస్తోంది. భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించాలని బలంగా కోరుకున్న వారిలో చంద్రబాబు, లోకేశ్ ముందువరసలో నిలిచారు.”
మహిళా క్రికెట్ జట్టు విజయాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి గారు మాతో పంచుకొని ఆనందించారు.. కూన ప్రమీల (కౌన్సిలర్)
“చిలకలూరిపేట శాసనసభ్యులు, మాజీమంత్రి వర్యులు ప్రత్తిపాటి పుల్లారావు, మంత్రి నారా లోకేశ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. భారత జట్టు ప్రపంచకప్ ఫైనల్ కు చేరిన శుభసందర్భాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే ప్రత్తిపాటి గారు స్థానిక క్యాంపు కార్యాలయంలో మహిళలు ఫైనల్ మ్యాచ్ చూసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. మన జట్టు కప్పు గెలిచిన ప్రత్యేక క్షణాల్లో ప్రత్తిపాటి గారు తమ ఆనందాన్ని మాతో పంచుకున్నారు. ఫైనల్ మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి ముందుగానే నియోజకవర్గంలోని మహిళా విభాగాలకు సమాచారం అందించారు. ముంబైలో ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నా..ఇక్కడే జరుగుతుందా అనిపించేలా మ్యాచ్ ముగిసేవరకు మా సోదరీమణులు తమ ఆనందోత్సాహలతో ప్రతి బాల్ కు జట్టుకు మద్ధతుగా నిలిచారు”
ప్రపంచం భారత్ వైపు చూసేలా మన మహిళా జట్టు సత్తా చాటింది యాలగల సుజాత (తెలుగుమహిళా విభాగం పట్టణ ప్రధాన కార్యదర్శి)
“ మహిళా క్రికెటర్ల చిరస్మరణీయ విజయాన్ని పురస్కరించుకొని ప్రత్తిపాటి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రపంచం మొత్తం భారత్ వైపుచూసేలా మన దేశ మహిళా క్రికెటర్లు తమ సత్తా చాటారు. ఉత్తమ ఆటతీరుతో ప్రతి ఒక్కరి మనసు గెలిచిన మహిళా క్రికెటరర్లు అందరికీ పేరుపేరునా ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నాం. మహిళలు దేనిలోనూ తీసిపోరని చెప్పడానికి ఈ విజయమే నిదర్శనం. తెలుగు మహిళల్ని అన్ని రంగాల్లో ముందుండేలా ప్రోత్సహిస్తున్న మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రి లోకేశ్, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గార్లకు పట్టణ తెలుగు మహిళలందరి తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను”
కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మాద్దుమాల రవి, టీడీపీ నాయకులు బత్తినేని శ్రీనివాసరావు, నజీరునిసబెగం, మున్సిపల్ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
