ప్రభుత్వ భూముల కబ్జాల పై బి ఆర్ ఎస్ నాయకుల నిరసన హాస్యాస్పదం.
సిపిఐ జాతీయ సమితి సభ్యులు యూసఫ్.
ప్రభుత్వ భూముల కబ్జా పై నిన్న బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు నిన్న పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసారని దాన్ని హైడ్రా పట్టించుకోవట్లేదని నిన్న నిరసన చెయ్యడాన్ని సిపిఐ గా ఆస్వాదిస్తున్నామని కానీ ఆక్కడే కాకుండా గత ప్రభుత్వ హయాంలో బి ఆర్ ఎస్ నాయకులు,ప్రజా ప్రతినిధులు,వారి అండతో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయ్యాయని వాటి పైన కూడా మాట్లాడాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు యూసఫ్,జిల్లా కార్యదర్శి ఉమా మహేష్,మండల కార్యదర్శి స్వామి లు షాపూర్ నగర్ ఏఐటీసీ కార్యాలయంలో నేడు ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ టిఆర్ఎస్ నాయకులు చిత్తశుద్ధితో ప్రభుత్వ భూముల పరిరక్షణ కొరకు పనిచేయాలని కేవలం వ్యక్తిగతంగా లేక రాజకీయ ప్రచారం కోసం మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారని ఇది దొంగలే దొంగలు అన్నట్టు ఉన్నదని కావున గత ప్రభుత్వ హాయంలో ఈ ప్రభుత్వ సహాయం లో జరుగుతున్న అక్రమాలపైన కూడా పోరాటం చేయాలని అన్నారు. హైడ్రాధికారులు కూడా స్పందించి గతంలో కూర్చున్న చోట్ల మల్ల నిర్మాణం జరుగుతున్నాయంటే వాటి వెనకాల గల కారణాలను ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన ఉన్నదని, కుత్బుల్లాపూర్ లో పరికిచెరువు, చింతలచెరువు, ఏపీ ఎస్ ఎఫ్ సి భూములు, జగద్గిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములు రక్షిస్తామని కూల్చివేతలు చేస్తామని చెప్పి నేడు పేద ప్రజల వద్దకు మాత్రమే వెళ్లి ఉన్న వాళ్ల అక్రమ నిర్మాణాలపై పోవట్లేదని, గతంలో కూర్చున్న చోట నేడు మళ్లీ నిర్మాణాలు కొనసాగిస్తున్నారని కాబట్టి హైడ్రా వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
