శంకర్‌పల్లి నుండి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన స్వాములు
శంకర్‌పల్లి: శంకర్‌పల్లి నుండి శబరిమల వరకు పాదయాత్రను పట్టణానికి చెందిన
అయ్యప్ప స్వాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా
పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రోత్సవాల నిర్వహించి స్వాములకు ఇరుముడి కట్టారు. ప్రశాంత్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప దీక్ష పరులు శబరిమల మహాపాదయాత్రకు బయలుదేరారు. అయ్యప్ప స్వామి ఆలయంలో స్థానిక బిజెపి సీనియర్ నాయకుడు గోవింద్ రెడ్డి అయ్యప్ప స్వాములను కలసి క్షేమంగా వెళ్లిరావాలని కోరారు. పాదయాత్రకు బయలుదేరిన వారిలో సాయి కిరణ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ప్రేమ్ గౌడ్, సోనుసింగ్, యశ్వంత్, ప్రవీణ్, వంశీ ఉన్నారు.