TEJA NEWS

మెడికల్ కాలేజీ కి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరు?

అమరావతి
ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీకి గత ప్రభుత్వం పెట్టిన వైయస్సార్ పేరును కూటమి ప్రభుత్వం తొలగించింది,తాజాగా మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి,పెట్టిన వైయస్సార్ పేరును తొల గించి ‘పింగళి వెంకయ్య పేరును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది,

ఈ నిర్ణయాన్ని బిజెపి స్వాగతించింది. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ ధన్యవా దాలు తెలిపారు. గత ప్రభుత్వం పలు విద్యా సంస్థలకు తమ ఇంట్లో వారి పేరు పెట్టు కుంటే.. తాము మాత్రం దేశ నాయకుల పేర్లు పెడుతున్నామని పేర్కొన్నారు.

మచిలీపట్నం మెడికల్‌ కాలేజీకి ప్రముఖ స్వాతం త్య్ర సమరయోధుడు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య పేరు పెట్టాలని వైసీపీ ప్రభుత్వ హయంలోనే విజ్ఞప్తులు వచ్చాయి.

కానీ జగన్‌ సర్కార్‌ పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు. పింగళి వెంకయ్య పేరును నిర్ణయించిన సీఎం చంద్రబాబు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.


TEJA NEWS