TEJA NEWS

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సర్వే పకడ్బంద్గా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

వనపర్తి
వనపర్తి జిల్లాలో
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
సాయంత్రం కలక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ తో కలిసి మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓ లు, సర్వే చేస్తున్న సిబ్బందితో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సర్వే అషామాషిగా చేయవద్దని, నిజమైన అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేవిధంగ సర్వే జరగాలని ఆదేశించారు. అర్హత ఉన్న వారికి కాకుండా అనర్హులకు లబ్ధి చేకూర్చే విధంగా తప్పులు చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సర్వే చేసే ముందు రోజు దరఖాస్తుదారునికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న ఇల్లు ఫోటో అందులో ఉన్న మౌలిక వసతుల ఫోటో తీసుకోవాలని, అదేవిధంగా కొత్తగా ఇల్లు నిర్మించుకొనున్న ఖాళీ స్థలం ఫోటో తీసుకొని జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు . స్వంత స్థలం కాకుండా ప్రభుత్వ స్థలం చూపిస్తే అంగీకరించవద్దని సూచించారు. సర్వే అనేది చాలా నాణ్యతతో కూడినదై ఉండాలని ఆదేశించారు.


సర్వే సకాలంలో పూర్తి చేయాలని, అదే సమయంలో నాణ్యతతో కూడినదై ఉండాలని ఆదేశించారు. లాగిన్ లు తీసుకొని సర్వే చేయకుండా ఉన్న సిబ్బంది పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఇప్పటి వరకు లక్ష్యం మేరకు సర్వే పూర్తి చేయని మండల అధికారులపై కలక్టర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సర్వే వేగవంతం చేయాలని ఆదేశించారు. డిసెంబర్ 27 నాటికి వనపర్తి జిల్లాలో 84141 దరఖాస్తులు సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, జడ్పి సీఈఓ యాదయ్య, డి.పి. ఒ సురేష్, హౌసింగ్ డి.ఈ విటోబా, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS