TEJA NEWS

The prices of chillies fell in a pile

ఒక్కసారిగా కుప్ప కూలిన మిర్చి ధరలు….. కోల్డ్‌ స్టోరేజీల్లో కొండల్లా పెరిగిపోతున్న నిల్వలు

గుంటూరు, ఆరుగాలం పాటు చమటోడ్చి పండించిన మిర్చీ పంటను అమ్ముకుని నాలుగు కాసులు చూస్తామనుకున్న రైతుకు ధరలు పడిపోవడంతో నిరాశ ఎదురైంది. ఎగుమతులు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

రాష్ట్రంలో మిర్చి ధరలు పతనమయ్యాయి. గత ఏడాది మేలో క్వింటాల్‌ మిర్చి కనీస ధర రూ.9 వేలు, గరిష్ట ధర రూ.26,500 పలికాయి. ఈ ఏడది ధరలు తగ్గడంతో క్వింటాల్‌ కనీస ధర రూ.8 వేలు, గరిష్ట ధర 20,700కి పడిపోయింది. తేజ మంచి రకానికి చెందిన మిర్చీ మాత్రమే క్వింటాల్‌ రూ.19,500 ధర పలుకుతోంది. మిగిలిన అన్నిరకాల మిర్చి ధరలు గణనీయంగా తగ్గాయి. ఎగుమతులు ప్రారంభంకాకపోవడంతో కోల్డ్‌ స్టోరేజీల్లో మిర్చీ నిల్వలు పేరుకుపోతున్నాయి. ఇప్పటికే 75 లక్షల మిర్చి బస్తాలు అక్కడ నిల్వ ఉన్నాయి.

పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఉన్న కోల్డ్‌ స్టోరేజీలల్లోనూ 75 లక్షల బస్తాల పంట నిల్వ ఉంది. ఒక్కో బస్తా 40 కిలోలు ఉంటుంది. ఉత్పత్తి పెరడం వల్ల ధర రోజురోజుకీ తగ్గుతుండటం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.


TEJA NEWS