ఆత్మీయ సమావేశానికి ప్రజల్లో విశేష స్పందన

ఆత్మీయ సమావేశానికి ప్రజల్లో విశేష స్పందన

TEJA NEWS

ఆత్మీయ సమావేశానికి ప్రజల్లో విశేష స్పందన

కోవూరు లో277 కోట్ల 7 7 లక్షలతో అభివృద్ధి

నాకు ఎమ్మెల్యే అన్న గర్వం పొగరు లేదు మీలో ఒకడిని

చిన్న చిన్న మనస్పర్ధలకు దూరంగా ఉందాం కలసి పార్టీని గెలిపించుకుందాం

ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు పివిఆర్ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది మండలంలోని నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజవర్గంలో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగిందని ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో కోవూరు మండలంలో 277వేల కోట్ల 77 లక్షలతో అభివృద్ధి చేశాము, కోవూరు మండలంలో అర్హులైన లబ్ధిదారులకు అందించిన సంక్షేమ పథకాల మొత్తం 413 కోట్ల 37 ఏడు లక్షలు ఇచ్చాం కోవూరు మండలం లో ఇల్లు లేని పేదలకు జగనన్న లే అవుట్ లలో 4వేల70 ఇల్లు పట్టాలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానికే దక్కింది, మన ముఖ్యమంత్రి కే అభివృద్ధి సంక్షేమమే తెలుసు ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్లి ఓటు హక్కు అడిగే హక్కు తమకు ఉందన్నారు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు అందించం కాబట్టే ప్రజల్లో వెళ్తే విశేష స్పందన వస్తుందన్నారు, 14 సంవత్సరాలు తెలుగుదేశం పాలల్లో అందించిన అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరాలు కాలంలో తాము అందించాము అన్నారు గ్రామ మండల నాయకులు చెప్పిన వారికే వాలంటీర్ గా నియమించాము అన్నారు వాలంటీర్లు అందరూ ఎంతో కష్టపడి పని చేస్తున్నారు ప్రతి గడపకు వెళ్లి ఇప్పుడు దాకా మనం ఏం సంక్షేమ పథకాలు అందించాము ప్రజలకు తెలియజేయాలి అన్నారు గెలుపు పై అతి నమ్మకం వద్దని ప్రతి ఒక్కరిని పలకరించి ఓట్లు అడగడం అడగాలన్నారు రాబోవు రెండు నెలలపాటు కష్టపడి తిరిగి ప్రజల్లోకి అనేకమై ఉండాలి అని తెలిపారు ప్రజలు పోలింగ్ బూత్ వద్దకు తీసుకొని వచ్చి వారిని చేత ఓటు వేయించాలని బాధ్యత అందరపై ఉందన్నారు వికలాంగులు వృద్ధులు ఇలాంటివారుకు వద్దకు బి.ఎల్.ఓ వచ్చి ఓటు వేయించుకునే అవకాశం ఉందని వారిని గుర్తించాలన్నారు ఎలక్షన్ల సమయంలో ఓటర్లను ఎలా బూతు వద్దకు తీసుకురావాలి అనే దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పార్టీ క్యాంప్ కార్యాలకు దూరంగా ఉన్న వారిని తిరిగి తీసుకుని రావాల్సిన బాధ్యత నాయకుల పై ఉందన్నారు, వర్గ విభేదాలు మరచి ముందుకు సాగాలని సూచించారు, అవసరమైనప్పుడు తాము సైతం ముందుకు వచ్చి పార్టీ నాయకులతో మాట్లాడతానని సంక్షేమ పథకాలు కొనసాగించాలంటే తిరిగి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలని, నేను ఒక మాజీ మంత్రిగా ఎమ్మెల్యేగా ఏ పొగరు ఉండదని మీలో ఒకటిగానే ఉంటాను అని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి రజత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డం రెడ్డి నిరంజన్ బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, మండల అధ్యక్షులు నలుబోలు సుబ్బారెడ్డి, జడ్పీటీసీ కవరగి శ్రీలత , ఎంపీపీ పార్వతి, డి .ఎల్ .డి .ఏ. డైరెక్టర్ కాటన్ రెడ్డి దినేష్ రెడ్డి, జల జీవన్ మిషిన్ చైర్మన్ గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైస్ ఎంపీపీ శివుని నరసింహులు రెడ్డి, కో-ఆపరేటివ్ సభ్యులు జుబేర్ భాష ,సర్పంచ్ ఏకశిరి విజయ, గంగవరం సర్పంచ్ లక్ష్మి కుమారి, జిల్లా చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి పన్నెం సుధాకర్, రాష్ట్ర పొందిలి కార్పొరేషన్ చైర్మన్ కిషోర్ సింగ్, ప్రచార విభాగ అధ్యక్షులు అత్తిపల్లి అనుప్ రెడ్డి, మండల కోశాధికారి మావులూరు వెంకటరమణారెడ్డి, మండల సచివాలయ మండల కన్వీనర్ కవర గిరి ప్రసాద్,కోవూరు యువజన విభాగ అధ్యక్షుడు మల్లవరపు చిరంజీవి, రైతు విభాగ అధ్యక్షులు భీమ తాటి శ్రీధర్, బెల్లంకొండ విజయ్, దేవవరం సాయి యశ్వంత్, రెడ్డి, క్యాటరింగ్ అధినేత చంద్ర, నాయకులు,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS