రక్షించాల్సిన రక్షక భటుడు మహిళా భక్షకుడు అయ్యాడు. కాపాడండి అని స్టేషన్ కొచ్చిన యువతిని పెళ్లి చేసుకుంటాను అని లొంగబరుచుకొని మోసం చేసిన వైనం చివరికి…?
రక్షించాల్సిన రక్షక భటుడు మహిళా భక్షకుడు అయ్యాడు. కాపాడండి అని స్టేషన్ కొచ్చిన యువతిని పెళ్లి చేసుకుంటాను అని లొంగబరుచుకొని మోసం చేసాడు.
దీంతో బాధిత యువతి మోసపోయానని గ్రహించి సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఎస్సైని సైదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లాకు
చెందిన ఓ గిరిజన యువతి నగరంలో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ సైదాబాద్ పీఎస్ పరిధిలోని తన అత్త ఇంట్లో ఉంటోంది. గతేడాది జనవరిలో అత్త, మామల మధ్య జరిగిన గొడవ కారణంగా ఫిర్యాదు చేసేందుకు సైదాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.
ఆ సమయంలో ట్రైనీ ఎస్సైగా ఉన్న నిజామాబాద్‌కు చెందిన పబ్బా అరుణ్(29) క్రమంగా ఆ యువతితో పరిచయం పెంచుకున్నాడు.
ఫోన్ నంబరు తీసుకొని తరచూ వాట్సాప్‌లో టచ్‌లో ఉంటూ ప్రేమాయణం నడిపాడు.
ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆ యువతిని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆరునెలల క్రితం సదరు యువతి అరుణ్ ఫోన్‌లో అతడికి మరో అమ్మాయితో నిశ్చితార్థం అయిన ఫొటోలను చూసి నిలదీసింది. ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటానని అరుణ్ నమ్మబలికాడు. ఆ తర్వాత నెలల గడుస్తున్నా అరుణ్ పెళ్లి ప్రస్తావన వాయిదా వేస్తుండడంతో యువతి అరుణ్ నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి సోదరుడికి ఫోన్ చేసి తమ సంబంధం గురించి చెప్పింది. ఈ క్రమంలో అరుణ్ యువతికి ఫోన్ చేసి పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడంతో బాధితురాలు సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని.. ప్రస్తుతం సిద్దిపేట కమిషనరేట్ వీఆర్‌లో పనిచేస్తున్న ఎస్సై అరుణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధిత అమ్మాయి స్టేట్మెంట్ను మరోసారి తీసుకొని ఎస్సై అరుణ్‌ని విచారిస్తున్నారు. వాట్సాప్, కాల్స్ డేటా వీటన్నింటినీ సైదాబాద్ పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసు డిపార్ట్మెంట్లో ఉండి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం పట్ల పోలీసు శాఖపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.