కదిరిలో ఆధ్యాత్మిక శోభ – అయోధ్య రాములవారి కళ్యాణ ఏర్పాట్లు పూర్తి

కదిరిలో ఆధ్యాత్మిక శోభ – అయోధ్య రాములవారి కళ్యాణ ఏర్పాట్లు పూర్తి

TEJA NEWS

కదిరిలో ఆధ్యాత్మిక శోభ – అయోధ్య రాములవారి కళ్యాణ ఏర్పాట్లు పూర్తి !

ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరిలో అధ్యాత్మిక శోభ ఉట్టి పడుతోంది. కదిరి నగరం అంతా ఎటు చూసినా కాషాయ జెండాలే కనిపిస్తున్నాయి. జై శ్రీరామ్ నామస్మరణతో ప్రజలు భక్తి భావంతో రామయ్య కళ్యాణం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయోధ్య ఆలయ ట్రస్ట్ , కదిరిసేవాభారతి ఆధ్వర్యంలో బుధవారం అత్యంత భారీగా కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. దాదాపుగా యాభై వేల మందికిపైగా భక్తులు హాజరయ్యే వకాశం ఉంది. కదిరిలో ప్రభుత్వ క్రీడా మైదానంలో ఈ కళ్యాణోత్సవానికి ఏర్పాట్లూ పూర్తయ్యాయి. రామ రథాలతో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సోమవారం కదిరిలో వేలాది మందితో జరిగిన శ్రీ అయోధ్య సీతారాముల ర్యాలీలో జరిగింది.

అయోధ్య రాముడి కళ్యాణోత్సవం – కదిరిలో ఆనంద వైభవం

కదిరితో పాటు చుట్టుపక్క ప్రాంతాల్లో అధ్యాత్మకి శోభ ఉట్టి పడుతోంది. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రత్యేక బాధ్యతలుతీసుకుని లో ఈ కళ్యాణోత్సవం ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యంత భారీగా.. జాతీయస్థాయి రుత్విక్కులు, పండితులు, ప్రముఖులు కల్యాణోత్సవానికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం జరగనున్న కల్యాణోత్సవం కోసం ప్రతి ఇల్లు భాగం అవుతోంది. దేశమంతా అయోధ్య గురించే చర్చ. ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తం అయోధ్య గురించే మాట్లాడుకుంటోంది. అందరూ ఒకే సారి అయోధ్య వెళ్లకపోవచ్చు కానీ.. భక్తులు అంతా ఎవరి స్థాయిలో వారు అయోధ్య ప్రాణప్రతిష్ట వేడుక్లని చేసుకున్నారు. వాటికి కొనసాగింపుగా కదిరిలో అత్యంత భారీగా అయోధ్య సీతరాముల కల్యాణం నిర్వహించాలని నిర్ణయించారు.

శ్రీ రామరథం ద్వారా గ్రామ గ్రామాన ప్రచారం

దాదాపుగా 50 వేల మంది భక్తులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవానికి సంబంధించి విస్తృతంగా ప్రచారం చేశారు. ఇందు కోసం గ్రామ గ్రామానికి శ్రీరామరథం ద్వారా సమాచారం పంపారు. కల్యాణోత్సవానికి దేశంలో ఉన్న అధ్యాత్మిక ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి పండితులు వచ్చి ఈ కల్యాణోత్సవంలో పాల్గొననున్నారు. భక్తులకు కూడా కల్యాణోత్సవంలో ప్రత్యేకమైన బాధ్యతలు తీసుకునేందుకు అవకాశం కల్పించే యోచన చేస్తున్నారు. శ్రీరాముని సేవలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తారు. అదో అదృష్టంగా భావిస్తారు. అందుకే కల్యాణోత్సవం అందరి చేతుల మీదుగా జరిగిందనిపించేలా నిర్వహించనున్నారు. బ్రాహ్మశ్రీ చాగంట ప్రవచనం చెప్పనున్నారు.

జాతీయ కార్యవర్గ సమావేశాల నుంచి నేరుగా కదిరికి వచ్చిన విష్ణు

జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విష్ణువర్దన్ రెడ్డి పాల్గొన్నారు. తర్వాత కీలకమైన సమావేశాలు ఉన్నప్పటికీ … రాముని కళ్యాణోత్సవం ఉండటంతో హుటాహుటిన కదిరి వచ్చారు. అయోధ్య రాముని కల్యాణం విషయంలో మాత్రం పార్టీలకు అతీతంగా వ్యవహరాలు జరుగుతున్నాయి. అందరూ తలో చేయి వేస్తున్నాయి. కార్యక్రమాన్ని తలపెట్టి.. నిర్వహిస్తున్నది బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కావడంతో ఆయన నేతృత్వంలో జరుగుతాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయమంలో రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ విష్ణువర్ధన్ రెడ్డి .. రాముడికి సేవకు ప్రాధాన్యం ఇస్తున్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS