TEJA NEWS

ఆంధ్రజ్యోతి విలేకరిపై జరిగిన దాడిని ఖండిస్తూ వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర హోమ్ మినిస్టర్ ‘తానేటి వనిత’ ని కలిసి వినతి పత్రం అందజేసిన ప్రజా టీవీ చైర్మన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ చైర్మన్ “మార్నే బాల నరసింహులు”.

మార్నే బాల నరసింహులు (ప్రజా టివి చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ చైర్మన్) మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా, రాప్తాడు లో నిర్వహించిన సిద్ధం సభలో తన పనిలో తాను విధులు నిర్వహిస్తున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పై వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు దాడి చేసి అతి కిరాతకంగా మానవులు అని మరిచి మృగాల మాదిరి అతనిపై దాడి చేయడం జరిగినది. జర్నలిస్టుగా పనిచేసే ప్రతి ఒక్కరికి ఫోటోలు వీడియోలు తీయడం మరియు ప్రశ్నించే హక్కు ఉంటుంది. ప్రతి జర్నలిస్టు ఫోటోలు వీడియోలు తీయడం మరియు ప్రశ్నించడం ఎవరి కోసం? మీ కోసమే కదా కష్టపడుతున్నది. మీకోసం ప్రతి ఒక్క జర్నలిస్టు తన పెళ్ళాం పిల్లలను వదిలి ఎండ ,వాన, గాలి లెక్క చేయకుండా వార్తలను సేకరించి ప్రజలకు తెలియజేయడానికి కష్టపడుతున్నాడు. జర్నలిస్టులు లేనిది ప్రజా పాలన ఎలా తెలుస్తుంది? వార్తలు ఎవరి సేకరిస్తారు? మీకు సమాచారం ఎవరు ఇస్తారు? ఒక జిల్లాలో కలెక్టర్ లేదా ఎస్పీ మరియు గవర్నమెంట్ అధికారులు ఎలా పనిచేస్తున్నారు ? అనేది మీకు ఎలా తెలుస్తుంది? అదేవిధంగా ఒక జిల్లాలో రాజకీయ నాయకులు ఎలా పని చేస్తున్నారు అని తెలుస్తుంది? ఇవి అన్ని మీకు తెలియాలంటే జర్నలిస్ట్ బయటికి రావాలి, ఫోటోలు తీయాలి, వీడియోలు తీయాలి. అధికారులను ప్రజాప్రతినిధులను ప్రశ్నించాలి అప్పుడే మీకు నిజా నిజాలు తెలుస్తాయి.అలాంటి బృహత్తర కార్యాన్ని నిర్వహిస్తున్న జర్నలిస్టుని మనిషి అన్న పదం మరిచిపోయి మానవ మృగంలాగా వందలాదిమంది అతనిపై దాడి చేసి హింసించి కొట్టి గాయపరచడం జరిగినది. కాబట్టి ప్రతి ఒక్క జర్నలిస్ట్ యూనియన్ ,జర్నలిస్ట్ సంఘాలు స్పందించి ప్రతి జిల్లాలో ఎస్పీ కార్యాలయం నందు కంప్లైంట్ ఇచ్చి న్యాయం జరిగే వరకూ మీరు కూడా మీ వంతు పాత్ర వహించాలని తెలియజేయడమైనది.
కావున ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రివర్యులు తానేటి వనిత ని కలిసి జర్నలిస్ట్ కృష్ణ పై దాడి చేసిన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా అతనికి గవర్నమెంట్ నుంచి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం కూడా చేయాలని తెలియజేయడం జరిగినది.
వీటిపై స్పందించిన హోం మంత్రి తానేటి వనిత సానుకూలంగా స్పందించి దాడి చేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకొని శిక్షిస్తామని తెలియజేయడం జరిగినది.


TEJA NEWS