TEJA NEWS

గందరగోళంగ ముగిసిన పుర సమావేశం

తప్పుల తడకగా ఎజెండా అంశాలు, ఆక్షేపించిన విపక్ష కౌన్సిలర్లు

సమావేశానికి గైర్హాజరైన మున్సిపల్ కమిషనర్

వనపర్తి
వనపర్తి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం లొ అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ పుర అధికారులతో కలిసి 27 అంశాలతో కూడుకున్న యజెండాను తయారుచేసి కౌన్సిల్ ముందు ప్రవేశ పెట్టి చైర్మన్ పుట్టపాక మహేష్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ లు అధ్యక్షతన చర్చ ప్రారంభించడం జరిగింది ముందుగా అధికారులు యజెండాలోని అంశాలను చదివి సభ్యులకు వినిపించడంతో చర్చ ప్రారంభమైంది గత బిఆర్ఎస్ పాలనలో పట్టణంలోని రోడ్ల విస్తరణ దాదాపుగా 80 శాతం పూర్తి చేయడం జరిగిందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు కావస్తున్న మిగిలిపోయిన రోడ్ల విస్తరణ కు ప్రభుత్వం నుండి ఒక పైసా రాలేదని నిధులు తీసుకురావడంలో మున్సి పాలకులు స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫలం చెందారని ప్రతిపక్ష బి ఆర్ఎస్ కౌన్సిలర్లు నాగన్న యాదవ్ బండారు కృష్ణ కాగితాల లక్ష్మీనారాయణ కంచె రవి లు తీవ్రంగావిమర్శించారు ఎజెండాలోని రెండు ఎజెండా అంశమైన సీఎం కప్పు జిల్లా స్థాయి క్రీడల సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం చదును చేయుట కోసం ప్రైవేట్ జెసిబి ట్రాక్టర్స్ డోజర్ రోలర్ మరియు వాటర్ ట్యాంకర్లను ఎంగేజ్ చేసినందుకు 3 లక్షల ఖర్చు ఎలా ఎందుకు అయ్యిందో దాని లెక్కల వివరాలను చూపాలని అలాగే ఎజెండా లోని18 వ అంశం వీధి కుక్కల సంతాన ఉత్పత్తి నిరోధించేందుకు యాంటీ రెబ్బీస్ వ్యాక్సినేషన్ చేయించుటకు ఒక్క కుక్కకు 1650 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని ఎజెండాలో తెలిపినప్పటికీ అలా ఎన్ని వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేసి జంతు సంరక్షణ కేంద్రంలో ఉంచారో వాటికి ఎంత ఖర్చయిందో లెక్కలు చూపలేదని మొత్తం లెక్కలు చూపాలని అలాగే పట్టణం సుందరీ కర్ణ కోసం రోడ్ల మధ్యలో నాటిన చెట్ల నిర్వహణ కోసం అయినా ఖర్చులపై మున్సిపాలిటీ పరిధిలోని నరసింగాపల్లి వద్దా మున్సిపాలిటీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు ఆకుపై చేసు కోవడం జరిగింది

గత కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకొని అక్కడ పార్కును ఏర్పాటు చేసి హరితహారం పథకంలో పార్కులో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించడం జరిగిందని కానీ ప్రైవేటు వ్యక్తులు కోర్టుకు వెళ్లడం జరిగిందని ప్రస్తుతమున్సిపల్ కమిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రైవేటు వ్యక్తులకి కోర్టు ద్వారా వెళ్లే పరిస్థితి ఉందని దాన్ని కాపాడాలన్న అంశాలపై అధికార పక్షం కాంగ్రెస్, విపక్షం బి ఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతోసాధారణ సమావేశం గందరగోళంగా మారింది దీంతో ఎజెండాలోని చాలా అంశాల పై అసలు చర్చనే జరగకుండా సమావేశాన్ని ముగించడం జరిగిందని అసలు ఎజెండాను అధికారపక్షం సభ్యులు అధికారులు కలిసి తప్పులు తడకగా ఎజెండాను రూపొందించారని అసలు ఏజెండాపై చర్చ జరుపుకుండానే అంశాలను ఆమోదించుకునే కుట్రతోనే సమావేశాన్ని వాయిదా వేయడం జరిగిందని అనుమానాలను వ్యక్తం చేశారు ఎజెండా తయారు చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన కమిషనర్ మున్సిపల్ సమావేశానికి హాజరు కాకుండా ఆయన గైర్హాజరు అవ్వడంతోనే విషయం బోధపడుతుందని బి ఆర్ఎస్ కౌన్సిలర్లు తెలిపారు ఇదిలా ఉంటే బిఆర్ఎస్ కౌన్సిలర్లు మాజీ చైర్మన్ వైస్ చైర్మన్లు సమావేశానికి ఎందుకు గైర్హాజరయ్యారు అని కాంగ్రెస్ కౌన్సిల్ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు,
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను అవమానించిన కౌన్సిల్
భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశవ్యాప్తంగా తెలిసిన విషయం కానీ ఆయన గౌరవార్థం కౌన్సిల్ సమావేశం ప్రారంభంలోనే రెండు నిమిషాలు మౌనం పాటించి సమావేశాన్ని వాయిదా వేసి తర్వాత నిర్వహించుకోవడం సాంప్రదాయం కానీ అధికారులు కౌన్సిల్ సభ్యులు ఆ విషయాన్ని మరిచినట్లు ఉన్నారు ఉదయం 11 గంటలకు సమావేశాన్ని ప్రారంభించి మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగించిన తర్వాత గుర్తుకొచ్చిందో ఏమో అప్పుడు మాజీ ప్రధానికి రెండు నిమిషాలు మౌనం పాటించి సమావేశాన్ని వాయిదా వేయడం మాజీ ప్రధానిని అవమానించడం మేనని కొంతమంది కౌన్సిల్ సభ్యులు సమావేశం వాయిదా అనంతరం తమ అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పుట్ట మహేష్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ తో పాటు ప్రతిపక్ష విపక్ష కౌన్సిల్ సభ్యులు నాగన్న యాదవ్ బండారు కృష్ణ కంచరవి బ్రహ్మం మహిళా సభ్యులు కో ఆప్షన్ సభ్యులు గులాం ఖాదర్ కైరున్ బేగం అధికారులు ఉమామహేశ్వర్ రెడ్డి తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS