నాలాల ఆక్రమనతో ఊరంతా జలమయం.
సహాయక చర్యలను పరిశీలించిన ఎమ్మార్వో శ్యామసుందర్ రెడ్డి.
సూర్యాపేట జిల్లా మనమోకటి తలిస్తే దైవం మరోటి తాలిచిందన్న విధంగా కొంతమంది స్వార్ధనికి నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే భారీ వర్షాలతో వచ్చిన వరద తిరిగి వారి ఇల్లే ముంచేసిన విచిత్ర ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. సాయంత్రం సూర్యాపేట జిల్లాలో భారీ వర్షం కురిసింది. 21.8 మి.మీ. వర్షపాతం నమోదయింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ క్రమంలో సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామంలో కురిసిన వర్షానికి ఇంట్లోకి వర్షం నీరు వచ్చి చేరాయి. ఎక్కువ మొత్తం లో వర్షం నీరు ఇళ్లలోకి చేరడంతో ఇంట్లో బియ్యం, బట్టలు, వంట సరుకులు నీటమునిగాయి. ప్రజలు ఇళ్లల్లో ఉండే పరిస్థితి లేకపోవడంతో జనమంతా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి నీటిని వాగుళ్ళోకి తరలించే ప్రయత్నాలు చేయాసాగారు. గ్రామంలో మునుపెన్నడు లేని ఈ విపత్తుకు కారణం అక్కడ నివసించే కొందరు వ్యక్తులు కారణమని తెలుస్తుంది.
నాలాలను పూర్తిగా ఆక్రమించి నిర్మాణాలను చేపట్టడం, వరద నీరు వెళ్ళడానికి ఏర్పాటు చేసిన కాలువలను వారి ఇంట్లోకి వెళ్ళడానికి మార్గాలుగా మార్చుకోవడమే ఈ వరదలకు కారణాలుగా స్పష్టమవుతుంది. విషయం తెలుసుకున్న సూర్యాపేట ఎమ్మార్వో శ్యాంసుందర్ రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రాత్రి 09:00 గంటలవరకు సహాయక చర్యలను పరిశీలించారు. ఇదే విషయమై ఎంఆర్వో మాట్లాడుతూ ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తులకు వెంటనే నోటుసులు జారీచేసి కాలువలపై అక్రమ కట్టడాలను తొలగించాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విలేజ్ స్పెషల్ ఆఫిసర్ లక్ష్మి, ఆర్ఐ గోపి, ఆర్&బి ఈఈ సీతారామయ్య, కార్యదర్శి నర్సింహారావు, గ్రామ మల్టిపర్పస్ వర్కర్స్, గ్రామస్థులు తదితరులు హాజరయ్యారు.