తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 17 నుండి 23వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ఏడు రోజుల పాటు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవిందరాజ పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తారు. ఆ తరువాత ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.
ఫిబ్రవరి 17న శ్రీ కోదండరామ స్వామివారు, 18న శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారు, 19న శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు, 20న ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు, 21, 22, 23వ తేదీల్లో శ్రీ గోవిందరాజ స్వామివారు తెప్పలపై భక్తులకు కనువిందు చేయనున్నారు.
చివరి రోజు తెప్పోత్సవం అనంతరం ఎదురు ఆంజనేయ స్వామివారి సన్నిధికి స్వామివారు వేంచేపు చేస్తారు.