TEJA NEWS

పల్నాడు జిల్లాలో బీసీల జపం చేస్తున్న వైసిపి తెలుగుదేశం పార్టీ

ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రా కదలిరా కార్యక్రమంలో భాగంగా రేపు అనగా మార్చి రెండో తారీఖున గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలో సుమారు లక్ష మంది తో రా కదలిరా కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సమక్షం లో నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ కండవ కప్పుకుంటారని అందరూ భావించారు. కానీ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చిన లిస్టులో జంగా పేరు లేకపోవడం పలు అనుమానాలు తావిస్తుంది. ఎమ్మెల్యే సీటు విషయంలో క్లారిటీ లేకపోవడంతో చేరిక ఆగిందని తెలుస్తుంది. ఇదే గనక ఒకవేళ జరిగితే పార్లమెంటు వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ బీసీ ఓట్లు కోల్పోయే ప్రమాదం చాలా వరకు ఉంది. రేపు కార్యక్రమంలో చంద్రబాబు పల్నాడు జిల్లా వ్యాప్తంగా మిగిలిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తే వైసిపి పార్టీ కూడా పల్నాడు జిల్లావ్యాప్తంగా కొన్ని సీట్లను మార్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా పల్నాడు జిల్లా వ్యాప్తంగా హోరాహోరీగా రాజకీయం నడుస్తుంది. నరసరావుపేట గురజాల పెదకూరపాడు సత్తెనపల్లి విషయంలో వైసిపి అధిష్టానం ఎటు తేల్చుకోలేక పోతుంది. అటు తెలుగుదేశం పార్టీ కూడా పెదకూరపాడు గురజాల నరసరావుపేట విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నప్పటికీ పార్టీ నాయకులనుండి కార్యకర్తల నుండి తీవ్ర ఇబ్బందులు గురవుతుంది. అలానే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని పల్నాడు జిల్లా లో బీసీలకు కేటాయించాలని రెండు పార్టీలు కూడా బీసీల జపం చేస్తున్నాయి.


TEJA NEWS