TEJA NEWS

స్వర్గీయ గుడివాడ గుర్నాథరావు వర్ధంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు

కూర్మన్నపాలెం : జీవీఎంసీ 87 వార్డు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ మంత్రివర్యులు గుడివాడ గురునాథరావు 23వ వర్ధంతి సందర్భంగా మింది గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద గల గురునాథరావు విగ్రహానికి పూలమాలవేసి మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ తో కలిసి ఘన నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా సీనియర్ నాయకులు అయినటువంటి ప్రగాఢ వేణుబాబు మాట్లాడుతూ స్వర్గీయ గుడివాడ గుర్నాథ్ రావు మంత్రివర్యులుగా పని చేసేటప్పుడు మా వడ్లపూడి రెహాబిటేషన్ కాలనీలో డ్రైన్లు రోడ్లు సామాజిక భవనాలు మరియు ప్రజలకు అందుబాటులో ఉండి పనులు నిర్వహించారని నిర్వాసితుల కాలనీలకు గ్రూప్ రూపు రేఖలు మార్చారని ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ
కార్యక్రమంలో ప్రగడ వేణుబాబు, చిత్రాడ వెంకటరమణ, ముద్దపు దామోదర్, దుగ్గపు దానప్పలు, ప్రగడ శంకర్రావు , బోండా గోవిందరాజులు, ఎస్ ఈశ్వరరావు, దాసరి అప్పుడు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS