TEJA NEWS

పుంగనూరు పట్టణంలో ముస్లిం మైనార్టీ కుటుంబానికి చెందిన ఏడేళ్ల చిన్నారిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ,పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి !
ఈరోజు మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పుంగనూరు లో హత్యకు గురైన చిన్నారి పాప ఆత్మకు శాంతి కలగాలని ,దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఏఐఎంఐఎం నాయకులు తో కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వంలో చిన్నారులపై హత్యలు, అత్యాచారాలు జరగడం బాధాకరమైన విషయమని, ముచ్చుమర్రి ఘటంలో ఇంతవరకు ఎవరిని అరెస్టు చేయలేదు సరికదా ఎవరు చేశారో కూడా ఈ ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేకపోయింది. అదేవిధంగా పుంగనూరులో ఏడు సంవత్సరాల చిన్నారిని దారుణంగా చంపి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడేయడం దారుణమైన విషయని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి పుంగనూరు వస్తున్నారని తెలియగానే కూటమికి చెందిన పెద్దలకు వణుకు పుట్టి ముగ్గురు మంత్రులను మరియు హోం మంత్రి ని పుంగనూరు పంపి ఆ పాప తల్లిదండ్రులతో మాట్లాడించి ఈ విషయాన్ని తూతూ మంత్రంగా ముగించే కార్యక్రమం చేశారని, మూడు లక్షల కోసం హత్య చేశారని చెప్పి పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందని, కేవలం 3 లక్షల కోసం ఒక చిన్నారిని చంపడం సమంజసమేనా, అసలు ఇది వాస్తవమేనా అన్న అనుమానం ప్రజల్లో వ్యక్తం అవుతుందని, అసలు వాస్తవాలను బయటికి తీసి ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేస్తూ… గౌరవ జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపల్లెలో అత్యాచార ఘటన ,పిఠాపురం దగ్గర అత్యాచార ఘటనల మీద పత్రికలలో వార్తలు వస్తున్నాయి. మరి ఇన్ని ఆరోపణలు వస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది,

కేవలం మా మీద నిందలు వేసే కార్యక్రమం చేస్తూ కాలక్షేపం చేస్తుంది, ఇది తప్పని చిన్నారుల మీద అత్యాచారాలు ,హత్యలు చేస్తున్న వారి మీద వెంటనే తగిన చర్యలు చేపట్టాలని, వారుపై కఠినంగా శిక్షలు అమలు చేయాలని సూచించారు. ఇటువంటి ఘటనల్లో నిజమైన దోషులు ఎవరో వెంటనే కనుక్కొని, దోషులకు కఠినంగా శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకొని,ఇటువంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, అదేవిధంగా నరసరావుపేట లోని రేషన్ షాపుల్లో ఈరోజు కందిపప్పు గాని, బియ్యం గాని పంచదార గాని సక్రమంగా ఇవ్వట్లేదని, చాలా షాపుల్లో ఇంకా పంపిణీ మొదలు పెట్టనే లేదని, కార్డుదారులకు బియ్యం ఇవ్వకుండా డబ్బులు మాత్రమే ఇస్తామని చెప్పి వారి చేత బలవంతరంగా వేలిముద్రలు వేయించుకునే కార్యక్రమం రేషన్ డీలర్లు చేస్తున్నారని ,ఈ విషయాన్ని కూడా జేసీ గారికి విజ్ఞప్తి చేయడం జరిగిందని, ప్రజలందరికీ నిత్యవసర వస్తువులు అందేటట్లు చర్యలు తీసుకోవాలని ,అదేవిధంగా అనేక గ్రామాల్లో పెన్షన్లను తొలగించేస్తున్నారని, మరి కొంతమందిని పెన్షన్లను వేరే మండలాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారని రొంపిచర్ల లోని ఐదు పెన్షన్లను రాజుపాలెం మండలానికి ట్రాన్స్ఫర్ చేశారని ,వారు పెద్ద వయసులో ఒక మండలం నుంచి ఇంకో మండలానికి వెళ్లి ఏ విధంగా తెచ్చుకోగలరని దీనిపై వెంటనే స్పందించి గతంలో ఏ విధంగా అయితే అమలు జరిగిందో అదే విధంగా వారి సొంత గ్రామం లోనే వారికి పెన్షన్ ఇచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని కోరారు.

అదేవిధంగా ఐసిఐసి బ్యాంకు శాఖలో చిలకలూరిపేట శాఖలో సుమారు 40 కోట్లు నరసరావుపేట శాఖలో పందికోట్లు గల్లంతయినట్టుగా వార్తలు వస్తున్నాయని, కారకులైన ఉద్యోగస్తుల పై వెంటనే చర్యలు తీసుకొని వారిని అరెస్ట్ చేయాలని డిపాజిట్ దారులకు తక్షణమే వారి డిపాజిట్ చేసిన డబ్బులు తిరిగి అందజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల విపరీతంగా పెరిగిపోతున్నాయని ,గతంలో మేము పెంచామని ఆరోపణలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు, సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వం ఈ హామీలను ఏమాత్రం అమలు చేయకుండా నిత్యవసర వస్తువులు ,కూరగాయల ధరలు మాత్రం అమాంతం పెంచేశారని, పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు ,సమస్యల మీద జాయింట్ కలెక్టర్ గారికి సవివరంగా తెలియ చేస్తూ, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని, గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కూడా కూడా కచ్చితంగా మేము చెప్పిన సమస్యలు,విషయాలపై వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారని, ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఈ ఎంఐఎం నాయకులు షేక్ కరీముల్లా, షేక్ మౌలాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఖాజావలి మాస్టర్ గారు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కందుల ఎజ్రా, ఎస్టి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పాలపర్తి వెంకటేశ్వరరావు , మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు షేక్ రెహమాన్, షేక్ వలి, మాగులూరి రమణారెడ్డి, గాబ్రియల్ ,షేక్ కరీముల్లా, షేక్ ఖాదర్ బాషా, అచ్చి, శివ కోటి, సయ్యద్ సిలార్ భాష , తిప్పరయ్య,షేక్ ఖాజా, షేక్ జాఫర్ ,సయ్యద్ ఖాదర్బాషా , వరవకట్ట బుజ్జి కోట చిన్నబాబు, భూదాల కళ్యాణ్ ,p.చిన్ని, అను, బొగ్గరం మూర్తి, శివరాత్రి అశోకు, కాకుమాను కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS