శంకర్పల్లి మండలం లో ఉన్న వివిధ రకాల డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహన సదస్సు
మోకిలా,శంకరపల్లి , చేవెళ్ల వారి పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యం లో ట్రాఫిక్ అవగాన కార్యక్రమం
శంకరపల్లి : శంకర్పల్లి మండల గ్రామాల్లో ఉంటున్న వివిధ ఆటో డ్రైవర్ల కి మరియు క్యాబ్ డ్రైవర్లకు ట్రాఫిక్ మోకిలా పోలీస్ స్టేషన్,శంకరపల్లి పోలీస్ స్టేషన్,చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వారు సంయుక్తంగా శంకరపల్లి పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఆటో డ్రైవర్లు కచ్చితంగా యూనిఫామ్ ధరించి ఉండాలని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఇన్సూరెన్సు తగిన పత్రాలు ఉండాలని సూచించారు.ఆటోలలో పరిమితికి మించి వాహనదారులను ఎక్కించుకోకూడదు అని డ్రైవర్ సీట్ సీటు పక్కన వాహనదారులను ఎక్కించుకొనరాదు అని వివరించారు.
వాహనదారులు అందరూ కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్సు , ఇన్సూరెన్స్ కలిగి ఉండవలెను అని, మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను నడపకూడదు అని, ఫోర్ వీలర్ వాహనాలు నడిపే వారు కచ్చితంగా సీట్ బెల్ట్ ధరించి ఉండవలెను, సెల్ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని హెచ్చరించారు, ప్రతి ఒక్కరు కచ్చితంగా ట్రాఫిక్ నియమాలను పాటించాలన్నారు.ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చేవెళ్ల ట్రాఫిక్ పీఎస్ ఇంచార్జ్ శ్రీ గణేష్ సూచించారు. ఇట్టి కార్యక్రమంలో శంకర్పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ ,మొకిల సీఐ వీరబాబు ,ఆర్టీఏ అధికారులు పాల్గొన్నారు.