TEJA NEWS

ఏపీకి ప్రయాణం చాలా కాస్ట్లీ గురూ..!
వేసవి సెలవులు, ఎన్నికల నేపథ్యంలో ఏపీకి చెందిన చాలామంది హైదరాబాద్‌ నుంచి తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలామంది ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా కొన్ని ట్రావెల్స్‌ రెట్టింపు ధరలు వసూలుచేస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రూ.800 ధర ఉంటే సుమారు 2వేలపైనే వసూలు చేస్తున్నాయని చెబుతున్నారు.


TEJA NEWS