TEJA NEWS

నేడు ఇడుపులపాయకు షర్మిల.. వైఎస్ ఘాట్ వ‌ద్ద నివాళి

అమరావతి:జనవరి 20
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల ఇవాళ‌ ఇడుపులపాయకు వెళ్లనున్నారు.

మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్న షర్మిల. వైఎస్‌ ఘాట్‌ దగ్గర షర్మిల నివాళులర్పిస్తారు.

రాత్రికి ఇడుపులపాయలోనే బస చేయనున్నారు. రేపు విమానంలో విజయవాడకు బయలుదేరి షర్మిల వెళతారు.

రేపు పీసీసీ చీఫ్ గా బాధ్యతలను ష‌ర్మిల‌ చేపట్టనున్నారు.


TEJA NEWS