ఇద్దరు గజ దొంగల అరెస్ట్

ఇద్దరు గజ దొంగల అరెస్ట్

TEJA NEWS

తిరుపతి జిల్లా…

ఇద్దరు గజ దొంగల అరెస్ట్.

తిరుపతి పరిసర ప్రాంతాలలో గత మూడు సంవత్సరాలుగా తప్పించుకొని చైన్ స్నాచ్చింగ్, ఆర్థిక నేరాలు చేస్తున్న ఇద్దరు దొంగలు అరెస్టు.

ఒంటరిగా వయస్సు పైబడిన ఆడవారే టార్గెట్.. మాయమాటలు చెప్పి.. వారి మెడలోని బంగారు చైన్ లను లాక్కొని పారి పోవడమే వీరి నేర వృత్తి.

జిల్లా వ్యాప్తంగా పలు పోలిస్ స్టేషన్ల పరిధిలో సుమారు 14 కి పైగా దొంగాతనములు, చైన్ స్నాచ్చింగ్, మోటార్ సైకిల్ దొంగాతనాలకు పాల్పడిన ముద్దాయిలు.

సుమారు రూ.46,93,500/- ల విలువ గల 803 గ్రాముల బంగారు, 900 గ్రాముల వెండి ఆభరణములు, ఒక రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్, 4 కే‌జి‌ల గంజాయి మరియు ఒక హోండా డ్రీమ్ మోటార్ సైకల్ స్వాధీనం చేసుకున్న తిరుచానూరు పోలీసులు.

ఇప్పటివరకూ ఎవరూ పట్టుకోలేని ముద్దాయిలపై ఖచ్చితమైన నిఘా పెట్టి, మొట్టమొదటిసారిగా వీరిని పట్టుకున్న తిరుచానూరు పోలీసులు.

అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసు వారికీ సమాచారం అందించండి.

ఇంటికి తాళం వేసి సుదూర ప్రాంతాలకు వెళ్ళే ప్రజలు పోలీసు వారు అందించే LHMS App సేవలను సద్వినియోగం చేసుకోండి, ఈ సేవలు పూర్తిగా ఉచితం.

జిల్లా ఎస్పి శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపిఎస్.,

అరెస్ట్ చేసిన ముద్దాయిల వివరాలు:-

  1. పాపాని క్రాంతి కుమార్ @ క్రాంతి, వయస్సు: 26 సం.లు, S/O లేట్ పాపాని శ్రీనివాసులు నాయుడు, బిసనేతం, నగరి మండలం. ప్రస్తుతం: మధురా నగర్, తిరుపతి.
  2. యమలం జ్ఞానేశ్ కుమార్ @ చంటి, వయస్సు:25సం.లు, S/O లేట్ ఆర్ముగం, K.T రోడ్, తిరుపతి.

కేసు వివరాలు:-

 ఇటీవల కాలంలో తిరుపతి నగరం తో పాటు జిల్లా వ్యాప్తంగా పలు దొంగతనాలు, చైన్స్ స్నాచింగ్, ద్విచక్ర వాహనాలను దొంగతనాలు చేసే ఇద్దరు గజ దొంగలను అరెస్టు గురించి, కేసుల వివరాలను మంగళవారం నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు విలేకరుల సమావేశం లో జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు వెల్లడించారు.

 జిల్లా క్రైమ్ అదనపు ఎస్పి శ్రీమతి విమలా కుమారి గారి పర్యవేక్షణలో, చంద్రగిరి సబ్-డివిజన్ డిఎస్పి యశ్వంత్ వారి ఆద్వర్యంలో, తిరుచానూరు సి‌ఐ శివ ప్రసాద్ రెడ్డి, ఎస్ఐ జగన్నాధ రెడ్డి మరియు సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా ఏర్పరచి చైన్ స్నాచేర్ల కోసం విస్తృతంగా గాలిస్తుండగా, ముందస్తుగా రాబడిన పక్కా సమాచారం మేరకు మోస్ట్ వాంటెడ్ దొంగలు అయిన పాపాని క్రాంతికుమార్ @ క్రాంతి మరియు అతనికి సహకరించిన యమలం జ్నానేష్ కుమార్ @ చంటి లను తిరుపతి-రేణిగుంట రోడ్డు 150 బైపాస్ రోడ్ లోని వార్త క్రాస్, వద్ద ఈ రోజు 23.01.2024 వ తేదిన ఉదయం 09:00 AM గంటలకు అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. 

 ఈ ముద్దాయిలిద్దరూ తిరుపతి నగరంతో పాటు 14 కేసులలో,7 తిరుచానూరు-4, తిరుపతి రూరల్-6, అలిపిరి-1, ఎస్.వి.యు. కాంపస్-1, పాకాల-1, తిరుపతి ఈస్ట్-1 పోలీసు స్టేషన్ల పరిధిలో నేరాలకు పాల్పడి ఉన్నారు. వారిని సమగ్రంగా దర్యాప్తు చేసి, వీరి వద్ధ రూ.44,16,500/- రూపాయల విలువ కలిగిన 803 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.69,000/- ల విలువ కలిగిన 900 గ్రాముల వెండి ఆభరణములు, రూ.1,50,000/- విలువ కలిగిన రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్, రూ.8000/- విలువ కలిగిన 4 కే‌జి‌ల గంజాయి మరియు రూ.50,000/- విలువ గల హోండా డ్రీమ్ మోటార్ సైకల్ లను స్వాధీనం చేసుకోవడమైనది. మొత్తం విలువ రూ. 46,93,500/- (నలబై ఆరు లక్షల తొంబై మూడు వేల ఐదువందలు రుపాయలు) స్వాధీనం చేసుకోవడమైనదన్నారు. 

 ఈ ముద్దాయిలు గత మూడు సంవత్సరాలుగా, తిరుపతి నగరం లో తిరుగుతూ ఒంటరిగా వయస్సు పై పడిన ఆడవారిని టార్గెట్ చేసుకొని, వారికి మేము మీ పిల్లలకు హోం ట్యూషన్ చెపుతాము అని, మేము బజాజ్ ఫైనాన్స్ నుండి రికవరీ కి వచ్చినాము అని, అడ్రెస్ వెరిఫికేషన్ అని రకరకాల మాయమాటలు చెబుతూ, వారి మెడలోని బంగారు చైన్ లను లాక్కొని పారి పోయేవారు, సదరు బంగారు ఆభరణాలను అమ్మగా వచ్చిన సొమ్మును వారి జల్సాలకు ఖర్చు చేసేవారు. తిరుపతి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసుల నిఘా, విసిబుల్ పోలీసింగ్ ను పెంచి, ముమ్మరంగా తనిఖీలు చేస్తుండటంతో, దొంగతనాలు చేయడం కష్టం అని భావించి నర్సీపట్నం, విశాఖపట్నం లో గంజాయిని తక్కువ రేటు కు అమ్ముతారని తెలసి అక్కడికి వెళ్లి గంజాయి కొనుకొన్ని వచ్చి తమిళనాడు రాష్ట్రం, చెన్నై లో గుర్తుతెలియని వ్యక్తులకు అధిక ధరకు అమ్మి డబ్బులు సంపాదించే వారు అని తెలిసిందన్నారు. గతంలో ఏమైనా ఈ విధంగా గంజాయి తెచ్చి అమ్మినారా!!! అనే కోణంలో కూడా సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు.

 తిరుపతి ఒక పర్యాటక ప్రాంతం కాబట్టి నిత్యం యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ యాత్రికుల ముసుగులో పాత నేరస్తులు చేసిన నేరం నుండి తలదాచుకోవడానికి, అదేవిధంగా కొత్త నేరాలు చేయుటకు తిరుపతి పరిసర ప్రాంతాలకు వస్తూ ఉంటారు. కావున అనుమానాస్పదంగా ఎవరైనా తమ ఇంటి దగ్గరకు వస్తే వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 ఇంటికి తాళం వేసి బయట ఊర్లకు వెళ్లే ప్రజల ఇళ్లలో ఎలాంటి దొంగతనాలు జరగకూడదనే ఉద్దేశ్యంతో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ వారు LHMS App సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారనీ,  జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎవరైనా ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లేటప్పుడు LHMS App నందు రిజిస్ట్రేషన్ చేసుకుని watch request చేస్తే, సదరు ఇంటిలో ఇంటి యజమానుల సమక్షంలో పోలీసు వారు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేస్తామనీ.. రక్షక్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది చేత సదరు ఇంటి పరిసరాల వద్ద పటిష్టమైన గస్తీ ఏర్పాటు చేసి ఎలాంటి దొంగతనాలు జరగకుండా నివారించడం జరుగుతుంది. కావున జిల్లా ప్రజలు LHMS App సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు విజ్ఞప్తి చేశారు. 

 అనంతరం ఈ కేసులను ఛేదించి దొంగలను పట్టుకోవడంలో ఉత్తమ ప్రతిబను కనపరచిన జిల్లా క్రైమ్ అదనపు ఎస్పి శ్రీమతి విమలా కుమారి, చంద్రగిరి డిఎస్పి టి.డి.యశ్వంత్, తిరుచానూరు సిఐ శివ ప్రసాద్ రెడ్డి, ఎస్ఐ జగన్నాధ రెడ్డి మరియు సిబ్బంది ఏఎస్ఐ రాఘవయ్య, పిసి లు జాకీర్ హుస్సేన్, ప్రభాకర్, ప్రసాద్, లక్ష్మిప్రసాద్, ముణిరత్నం చంద్రగిరి PS, నాగార్జున, చందు టెక్నికల్ విభాగం వారికి జిల్లా ఎస్పి శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపిఎస్., గారు ప్రశంశా పత్రాలను అందజేసి, అభినంధించారు.

 ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ క్రైమ్ శ్రీమతి విమల కుమారి, చంద్రగిరి డిఎస్పి డా.యశ్వంత్, తిరుచానూరు సిఐ శివప్రసాద్, ఎస్ఐలు జగన్నాథ్ రెడ్డి, వెంకటసుబ్బయ్య మరియు తిరుచానూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Print Friendly, PDF & Email

TEJA NEWS