*చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ
*రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్. పురందాస్ హాజరు .
శంకరపల్లి : నూతనంగా డి. ఎస్. సి 2024 ద్వారా నియామకం అయిన ఉపాధ్యాయులు అయిన ప్రవళిక, అర్చన, అరుణ, లలిత, ఆఫ్రిన్, అలివేలు మంగ,భరత్ కుమార్, రాజేందర్,రాఘవేందర్ కు సర్వీస్ పుస్తకాలు అందించారు. పి. ఆర్. టి. యు సంఘం ఉపాధ్యాయుల సమస్యలు పరిస్కారించడం లో ముందు ఉంటుంది అని, నూతన ఉపాధ్యాయులకు ఐ. డి. నెంబర్, ప్రాన్ నెంబర్ ఇప్పించడం లో మండల శాఖ కృషి చేసింది అని, మహిళా ఉపాధ్యాయులకు చైల్డ్ కేర్ లీవ్స్ ఇప్పించడం, 5 ప్రత్యేక సెలవులు సాధించడం, గత 50 సంవత్సరాలనుండి అనేక జి. ఓ. లు ఇప్పించిన మొనగాని సంఘం పి ఆర్ టి యు అని అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు సి. పి. ఎస్ సాధించే దిశగా పి. ఆర్. టి. యు కృషి చేస్తుంది అని, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి అన్నారు .
ఈ కార్యక్రమం లో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎస్. మహేందర్ రెడ్డి ,రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కె. కృష్ణారెడ్డి చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్. పురందాస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జయకృష్ణ ,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బలరాం , రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కృష్ణ ప్రకాష్ రెడ్డి , టి. జి. ఎస్. సి.పి. ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు దర్శన్ గౌడ్ జిల్లా కార్యదర్శి వినోద్ షాబాద్ అధ్యక్షులు కృష్ణ ,మొయినాబాద్ ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి , చేవెళ్ల మండల పి. ఆర్. టి. యు. అధ్యక్షులు దయానంద్ ,ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ , అధ్యక్షులు నర్సింహా రెడ్డి ,అసోసియేట్ అధ్యక్షులు జాన్సన్ గారు కార్యదర్శి శివకుమార్ మహిళా ఉపాధ్యక్షులు సంగీత ,మహిళా కార్యదర్శి అనిత ,రవీందర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, శంకర్, రాంచంద్రయ్య, బాలాజీ,అనుసుజ,మొదలైన వారు పాల్గొన్నారు.