TEJA NEWS

హైదరాబాద్:

ఓ టీవీ ఛానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసిన యువతిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు.

అతడిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో కిడ్నాప్ నకు పాల్పడినట్టు గుర్తించారు.

ఫిబ్రవరి 10వ తేదీ అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు ప్రణవ్ను కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించారు.

తనను పెళ్లి చేసుకోవాలంటూ సదరు యువతి యాంకర్ను ఒత్తిడి చేసింది.

11వ తేదీ ఉదయం నిందితురాలి బారి నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు యువతే కిడ్నాప్ చేయించినట్టు గుర్తించారు.

డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్న ఆమె ఓ మ్యాట్రిమొనీ సైట్లో ప్రణవ్ ఫొటోలు చూసి ఇష్టపడింది.

ఎలాగైనా అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని కిడ్నాప్ చేసి డిమాండ్ చేసింది.

ఉప్పల్ పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.

మ్యాట్రిమొనీ సైట్లో ప్రణవ్ ఫొటోతో చైతన్యరెడ్డి అనే యువకుడు ఆమెతో చాటింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.


TEJA NEWS