TEJA NEWS

యూపీఎస్సీ పరీక్ష -2023 లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన దోనూరి అనన్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అనన్యతో పాటు కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనన్యతో పాటు సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన తెలుగు అభ్యర్థులందరికీ ఈ సందర్భంగా సీఎం తన అభినందనలు తెలియజేశారు. దేశ సేవలో వారంతా మంచి పేరు గడించాలని ఆకాంక్షించారు.


TEJA NEWS