TEJA NEWS

Government implementing six guarantees, urban local issues

ప్రభుత్వంఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ, పట్టణ స్థానిక సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు విజ్ఞప్తి………బిజెపి

………………………………………………….

  *సాక్షిత వనపర్తి : * తెలంగాణలోఎన్నికల సమయంలో ఆరుగ్యారెంటీ ల పేరుతో రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిఏడు నెలలు కావస్తున్న ఇప్పటివరకు ఎలాంటి గ్యారెంటీలను అమలు చేయడం లేదని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అందలం ఎక్కించిన  ప్రజలపై తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తుందని ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని అధికారంలోకి వచ్చిన నెలలోపే అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులను ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్న ఇప్పటివరకు వాటి ఊసే లేదని, మహిళలకుఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి బస్సుల సంఖ్య తగ్గించి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇక స్థానికంగా ఉన్న వనపర్తి ఆర్టీసీ బస్టాండ్ లో కనీస సౌకర్యాలు కూడా లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే కనీస సౌకర్యాలను మెరుగుపరచాలని బస్టాండ్ లో గల షాపుల అద్దెల లో అక్రమాలు జరుగుతున్నాయని విచారణ జరిపి బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని,    పాలిటెక్నిక్  మరమ్మత్తుల కోసం  గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైనాయని పనులను వెంటనే ప్రారంభించాలని,  చిన్న చిన్న వర్షాలకె డ్రైనేజీలు పొంగిపొర్లుతూ వీధుల్లోకి ఇండ్లలోకి  వచ్చి మురుగు వాసన వస్తు పట్టణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని డ్రైనేజీ వ్యవస్థను సరిచేయాలని, పట్టణంలో ట్రాఫిక్ పెరిగిపోయి ట్రాఫిక్ సిగ్నల్స్ లేక త్రిబుల్ రైడింగ్లతో ప్రధాన కూడళ్లలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఇతరత్రా సమస్యలను ట్రాఫిక్ పోలీసులు గుర్తించి తగిన చర్యలు చేపట్టాలన్నారు అలాగే కలలకు కళాకారులకు నెలవైన  పట్టణంలో  నిర్మించిన ఎన్టీఆర్ కళాతోరణం పక్కన మద్యం దుకాణం ఏర్పాటు చేయడంతో లలిత కళాతోరణం నిరుపయోగంగా మారిందని వెంటనే స్పందించి వైన్ షాపును అక్కడ నుంచి తరలించాలని, రోడ్లపై మురికి కలువలపై బిర్యాని సెంటర్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెట్టిఅపరిశుభ్రమైన  ఆహార పదార్థాలను విక్రయిస్తూ పట్టణ ప్రజల్ని అనారోగ్యం పాలు చేస్తున్నారని వీటిపై సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టి  చర్యలు తీసుకోవాలని అలాగే పట్టణానికి సమీపంలో ఉన్న తిరుమలాయగుట్టపై గల తిరుమల స్వామి దేవాలయాన్ని అభివృద్ధిపరిచి పర్యాటక కేంద్రంగా మార్చితే దాని వలన చాలామందికి జోహార్ తో పాటు పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించినట్లు అవుతుందని 

తదితర అంశాలతో కూడుకున్న వినతి పత్రాన్ని నూతన కలెక్టర్ ఆదర్శ సురభికి పట్టణ బిజెపి శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు ముందుగా వనపర్తి జిల్లాకు మొదటిసారి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఆదర్శ సురభిని పట్టణ శాఖ ఆధ్వర్యంలో శాలువా తో సన్మానించి పూల గుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ వైస్ చైర్మన్ బాసెట్టి శ్రీనివాసులు మాజీ కౌన్సిలర్ ఏ సీతారాములు జిల్లా మహిళా అధ్యక్షురాలు అశ్విని రాధా, రాష్ట్ర మహిళా మోర్చా బిజెపి మాజీ కౌన్సిలర్ జ్యోతి పద్మ లక్ష్మి బిజెపి ప్రధాన కార్యదర్శి రాజేంద్ర సాగర్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ రవి శశి గోవిందు తదితరులు ఉన్నారు .

అలాగే పట్టణానికి సమీపంలో ఉన్న తిరుమలాయగుట్ట పై గల తిరుమల స్వామి దేవాలయాన్ని అభివృద్ధిపరిచి పర్యాటక కేంద్రంగా మార్చితే దానివలన చాలామందికి జీవనోపాధితో పాటు పట్టణ ప్రజలకు ఆరాధ వాతావరణం అందించినట్లు అవుతుందని,
పీఎం


TEJA NEWS