తేనేటి విందు కార్యక్రమానికి హాజరైన వేములపాటి అజయ్ కుమార్.
చిలకలూరిపేట: పట్టణంలోని 52 ఎకరాల్లో నిర్మించిన టిడ్కో ఇళ్ల సందర్శనార్థం వచ్చిన ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ను, కలిసి,టిడ్కో గృహాల సముదాయంలో గల సమస్యలను నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తోట రాజా రమేష్, జనసేన నియోజకవర్గ నాయకులు మండలనేని చరణ్ తేజ వివరించారు. అనంతరం యువ నాయకులు మండలనేని తేజ,వేములపాటి అజయ్ కుమార్ ను తమ నివాస గృహానికి తేనేటి విందుకు ఆహ్వానించగా ఆ కార్యక్రమంలో అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన అభిమానులు పలువురు పాల్గొన్నారు.