సీబీఐ డీఐజీగా వెంకట సుబ్బారెడ్డి
సీబీఐ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ గా ఐపీఎస్ వెంకట సుబ్బారెడ్డిని నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు ఆయన పదవిలో ఉంటారని పేర్కొంది. 2007 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన ఈయన
స్వరాష్ట్రం ఏపీ. ప్రస్తుతం షిల్లాంగ్గా సీఐడీ డీఐజీగా పనిచేస్తున్నారు. వెంటనే ఆయన్ను రాష్ట్ర సర్వీసు నుంచి రిలీవ్ చేయాలని కేంద్రం ఆదేశించింది.