TEJA NEWS

సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం లో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు

  • 2K రన్ ప్రారంభించిన అదనపు కలెక్టర్ రాంబాబు
  • పారిశుధ్య కార్మికులకు హెల్త్ క్యాంప్ నిర్వహణ

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా మంగళవారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన 2K రన్ ను జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం కాలంలో సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియపరచడానికి జిల్లా వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అర్బన్ డే సందర్భంగా సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2K రన్ ప్రారంభించడం హర్షణీయమని అన్నారు. మున్సిపల్ చైర్మన్, కమీషనర్ మరియు సిబ్బంది కి అభినందనలు తెలిపారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయం నందు పారిశుధ్య కార్మికులకు హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణాన్ని పరిశుభ్రంగా వుంచడానికి పారిశుధ్య కార్మికులు నిరంతరం కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి సంవత్సరం మున్సిపాలిటీ నందు హెల్త్ క్యాంప్ లు నిర్వహించి కార్మికులకు ఆరోగ్య పరిక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

కార్మికుల సేవల ద్వారానే సూర్యాపేట మున్సిపాలిటీకి జాతీయ స్ధాయి, రాష్ట్ర స్ధాయి అవార్డులు లభించాయని అన్నారు. కార్మికులకు మున్సిపాలిటీ ద్వారా బూట్లు, గ్లౌస్ లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు జరుపుతున్నట్లు చెప్పారు. సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ లను అమలు చేసిందని, మరికొన్ని పధకాలు త్వరలోనే అమలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం డాక్టర్ ల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరిక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందజేశారు. అత్యుత్తమ సేవలను అందించిన కార్మికులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, ఇఇ కిరణ్, డిఇ సత్యారావు, ఎస్ ఐ లు సారగండ్ల.శ్రీనివాస్, హెల్త్ అస్సిటెంట్ యం. సురేష్ ,బూర సతీష్, జూనియర్ అసిస్టెంట్లు గౌసుద్దిన్,ఎస్ ఎస్ ఆర్ ప్రసాద్, యాదగిరి, మనోజ్, ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ శివప్రసాద్ , మెప్మా ఇంఛార్జ్ శ్వేత, సిబ్బంది పాల్గొన్నారు.


TEJA NEWS