Smuggling of poor people's rice, vigilance raids seize 480 bags...
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలంలో జొన్నాడ నుండి ఆలమూరు రోడ్డులో అశోక్ లేలాండ్ లారీ లో పి.డి.ఎస్(రేషన్ బియ్యం)తో అక్రమ రవాణా చేస్తున్నారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ రెవెన్యూ సివిల్ సప్లయ్స్ అధికారులు వాహనాన్ని తనిఖీ చేశారు. ఆ లారి లో 480 బస్తాలు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు .సుమారు 23,500 కేజీల పి.డి.ఎస్ బియ్యం గా గుర్తించారు. ఈ పి.డి.ఎస్ బియ్యన్ని కాకినాడ జిల్లా జగన్నాధపురంకు చెందిన ఎస్ నరసింహమూర్తి లారీలో శృంగవృక్షం, పాలకోడేరు మండలం, భీమవరం కు చెందిన కనక దుర్గా ట్రడర్స్ నుండి లవన్ ఇంటర్నేషనల్ కాకినాడ కు రవాణా చేస్తున్నారు.ఈ పి.డి.ఎస్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్నారని అధికారులు చెప్పారు. రూ 18,69,250/- లు విలువ గల 23,500 కేజీల పి.డి.ఎస్(రేషన్ బియ్యం)ను లారీ నీ సివిల్ సప్లయ్స్ అధికారులు సీజ్ చేశారు.
6-ఏ క్రింద కేసు నమోదు చేశారు. రవాణా చేస్తున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు కు పోలీసు స్టేషన్ కు సిఫార్సు చేశారు. రీజనల్ విజిలెన్స్ ఎస్.పి. కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో పి.డి.ఎస్(చౌక బియ్యం) అక్రమ నిల్వలు, అక్రమ రవాణా పై నిరంతరం నిఘా కొనసాగుతుందన్నారు. ఎవ్వరైనా పి.డి.ఎస్(చౌక బియ్యం) కొనడం, అమ్మడం చేస్తే ఆయా వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖిలలో విజిలెన్స్ అధికారులు జగన్నాధరెడ్డి, వలి, కిషోర్, సి.ఎస్.డి.టి అలీషా రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.