TEJA NEWS

రావాడలో పల్లె పిలుస్తుంది కార్యక్రమం

అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో రావాడ గ్రామ పంచాయతీ నందు మండల వ్యవసాయశాఖ అధికారులుచే పల్లె పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మండల వ్యవసాయశాఖ అధికారి సిహేచ్ చంద్రవతి సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న పంట పొలాలను పరిశీలించి పంట చెదలు పట్ట కుండా వాడవాల్సిన పద్ధతులు, పిచికారీ గురించి రైతులకు వివరించారు అలాగే వరి పంటలో స్థుల మరియు స్థుల పోషకాలు నివారణకై తెల్ల జిల్లెడ ఆకుల ద్రావ నాన్ని తయారు చేసే విధానాన్ని ఎలా చెయ్యాలో తయారుచేసి చూపించారు. ఈ ద్రావణం ముఖ్యంగా పోటాషియం దోతినివారణకు ఉపయోగించాలని రైతులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో రావాడ సర్పంచ్ మొటూరు సన్యాసినాయుడు, మండల వ్యవసాయ అధికారి సిహెచ్ చంద్రవతి, విఎఎలు గౌతమీ, అనిత, జాస్మిన్, గ్రామ ప్రజలు పాలొగొన్నారు.


TEJA NEWS