కుత్బుల్లాపూర్ లో మీ సేవలు మరువలేనివి : వాటర్ వర్క్స్ జీఎం శ్రీధర్ రెడ్డి పదవీ విరమణ సభలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …
ఐడిపిఎల్ నందు గల వాటర్ వర్క్స్ కార్యాలయంలో నిర్వహించిన జిఎం శ్రీధర్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ అనేది తప్పదని నిత్యం ప్రజలకు సేవ చేయాలనే మీలాంటి ఉద్యోగి పదవీ విరమణ పొందడం కొంత బాధాకరమైన కుత్బుల్లాపూర్ లో మంచినీటి సమస్య పరిష్కారానికి మీరు చేసిన సేవలు మరువలేవన్నారు.
ఈ కార్యక్రమంలో 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు ఎర్వ శంకరయ్య, జలమండలి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.