18 సంవత్సరాలు నిండిన వారందరిని ఓటరుగా నమోదు చేస్తున్నాం.

18 సంవత్సరాలు నిండిన వారందరిని ఓటరుగా నమోదు చేస్తున్నాం.

TEJA NEWS

రాజమహేంద్రవరం, తేది.28.2.2024

గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదు అయిన పి ఏస్ పరిధిలో పర్యటించి దిశా నిర్దేశం చేస్తున్నాం

ఓటర్ల లో చైతన్యం కోసం రాజకీయ పార్టీల నుంచి సహకారం అవసరం

*జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టరు కే. మాధవీలత

18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరిని ఓటరుగా నమోదు చేస్తున్నామని, పోలింగ్ తక్కువ నమోదు అయినా పి ఎస్ ల వారీగా సమీక్ష నిర్వహించి అవగాహన పెంపొందుస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీ లత తెలియ చేశారు.

బుధవారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ లో ఓటర్ల జాబితా ప్రచురణ పై మరియు పోలింగ్ స్టేషన్లలో మౌలిక సదుపాయలు, పోలింగ్ శాతం పెంపు వంటి అంశాలపై కలెక్టర్ డా. మాధవీ లత జాయింట్ కలెక్టరు ఎన్ . తేజ్ భరత్, డి ఆర్ ఒ జి.నరసింహులు తో కలసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ కె . మాధవీలత మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాంతాలలో 18 సంవత్సరాలు నిండిన వారందరిని ఓటరుగా నమోదు చేస్తున్నామని, a క్రమంలోనే విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో మౌలిక వసతులను పరిశీలించి , తగిన ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైన చోట్ల మొబైల్ టాయిలెట్ ల కోసం ప్రతిపాదన చేస్తున్నామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో దివ్యాంగుల కొరకు ర్యాంపులు ఉండేలాగా కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. 80 సంవత్సరాలు నిండి నడవలేని వృద్ధులకు, 40 శాతం పైబడిన దివ్యంగ ఓటర్ల కోసం వారీ ఐహిచ్చాకం మేరకు ఫారం 12 D ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఇంటి వద్ద నుండే వారు ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు ఏవైనా సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి తీసుకుని వస్తే వాటిని వెంటనే పరిష్కరిస్తామన్నారు.

జిల్లాలోని 1569 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 16,05,762 మంది ఓటర్లు వున్నారన్నారు. ఇప్పటి వరకు ఫారం.6 క్రింద 20403 దరఖాస్తులు రాగానే 18572 దరఖాస్తులను పరిష్కరించా మన్నారు. ఫారం 7 క్రింద 20, 820 దరఖాస్తులు వచ్చాయని వాటిలో 13, 920, ఫారం 8 క్రింద 30,608 దరఖాస్తులు రాగా 28, 801 పరిష్కరించి ఓటరు జాబితాలో సంవరించామన్నారు.

అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన అంశాలకు సంబంధించి వివరిస్తూ
మరణించిన వారి పేర్లు జాబితా నుంచి తగిన నిర్థారణ చేస్తూ తొలగిస్తున్నామని, మరణం ధ్రువపత్రం లేకపోతే పంచనామా ఆధారంగా వారి కుటుంబ సభ్యులు ఆమోదంతో మాత్రమే తొలగిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఫారం 6 ద్వారా నూతన ఓటర్లు నమోదు, ఫారం 7, 8 ద్వారా చిరునామా మార్పులు వంటి అంశాలపై కలెక్టర్ మాధవీలత తెలిపారు.

ఫారం 7 సంబందించిన ఈ నెల 10 వ తేది నుంచి ఇప్పటి వరకు 6,752 పెండింగ్ వాటిని జాబితా నుంచి తొలగించాలన్నారు . ఇందులో చిరునామా మార్పులు 2367, మరణించిన వారు 2133, డూప్లికేట్ ఓట్లు 1468 గావున్న వాటిని ఓటర్ జాబితా నుంచి తొలగించామన్నారు.

సమావేశం లో జాయింట్ కలెక్టరు ఎన్.తేజ్ భరత్, డి ఆర్ ఒ జి.నరసింహులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు  కాంగ్రెస్ – నలబాటి రమేష్ (శ్యామ్) , వైయస్ఆర్ సీపీ – వై రాజశేఖర్, రాయుడు గణేష్ , టిడిపి – సిహెచ్ . శ్రీనివాస రావు ,   బిజెపి – బి. రామచంద్ర రావు,   కలెక్టరేట్ సిబ్బంది  తదితరులు ఉన్నారు.
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, రాజమహేంద్రవరం వారిచే జారీ.

Print Friendly, PDF & Email

TEJA NEWS